Asianet News TeluguAsianet News Telugu

చైతు ‘థాంక్యూ’ రిలీజ్ ఎప్పుడు పెట్టాడంటే...


ఈ మధ్య కాలంలో కథల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్న నాగ చైతన్య.. 'మజిలీ' తరువాత ఆయన కొత్తదనం గల కథలను మాత్రమే ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు.

Naga Chaitanyas Thank You pushed to 2022!
Author
Hyderabad, First Published Sep 30, 2021, 7:36 AM IST

అక్కినేని కుర్ర హీరో నాగచైతన్య లవ్ స్టోరీ  సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత డిఫరెంట్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న  డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు నాగచైతన్య.  ‘థాంక్యూ’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది.నాగచైతన్య మొదటి సారి హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. ప్యాచ్ వర్క మినహా మొత్తం షూటింగ్ పూర్తైంది. అక్టోబర్ లో ఆ ప్యాచ్ వర్క్ ని ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ మీద పూర్తి దృష్టి పెడతారు. ఈ నేపధ్యంలో ‘థాంక్యూ’ ఎప్పుడు రిలీజ్ కాబోతోందనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.

అందుతున్న సమాచారం మేరకు ‘థాంక్యూ’ చిత్రాన్ని 2022 వేసవికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ డిసెంబర్ లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నిర్మాత దిల్ రాజుకు ఉందిట. మరో ప్రక్క తన తండ్రి నాగార్జున తో చేస్తున్న బంగార్రాజు చిత్రం 2022 సంక్రాతికి విడుదల చేయబోతున్నారు.అమీర్ ఖాన్ హీరోగా చేస్తున్న లాల్ సింగ్ చద్దా చిత్రం వాలంటైన్స్ డే కానుకగా విడుదల చేస్తారు. ఈ సినిమాలో నాగచైతన్య కీలకమైన పాత్ర చేస్తున్నారు.

‘థాంక్యూ’ విషయానికి వస్తే... తమిళ దర్శకుడు విక్రమ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరు. గతంలో అక్కినేని కుటుంబ హీరోలతో 'మనం' వంటి వైవిధ్యమైన చిత్రాన్ని రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన కొన్ని సినిమాలు పెద్దగా అలరించలేకపోతున్నాయి. విక్రమ్ మనం తర్వాత మరోసారి అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కిన హలో మాత్రం కొంత నిరాశ పరిచింది. ఆ తర్వాత విక్రమ్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ అనే థ్రిల్లర్‌ను తీశాడు. అయితే ఆ సినిమా కథ బాగున్న పెద్దగా అలరించలేకపోయింది. అది అలా ఉంటే ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని అక్కినేని నాగ చైతన్యతో చేస్తున్నాడు. 
 
ఇక ఈ సినిమా కథ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తోంది. విక్రమ్ కుమార్ ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాల కంటే ఈ సినిమా చాలా విభిన్నంగా ఉండనుందట. నిజానికి 'మనం' సినిమా తర్వాత ఇంతవరకు సరైన హిట్ అందుకోలేదు విక్రమ్. దీంతో నాగ చైతన్యతో ఓ హార్రర్ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడని తెలుస్తుంది. దీంతో ఇప్పటి వరకు లవర్ బాయ్ గా కనిపించిన చైతన్య ఫస్ట్ టైం హార్రర్ సినిమా చేయనున్నాడు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios