Asianet News TeluguAsianet News Telugu

ట్రైనింగ్ తీసుకున్న చైతు, ఖుషీ అయిన శేఖర్ కమ్ముల

సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత మరో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఫిదా వంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల ఆ తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. వారి ఇంట్రస్ట్ ని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్ తో సినిమా చేయబోతున్నాడు శేఖర్ కమ్ముల. 

Naga Chaitanya will speak Telangana Accent in the Shekar Kammula film
Author
Hyderabad, First Published Aug 17, 2019, 10:54 AM IST

హీరోలు నటనపై పూర్తి దృష్టి పెడుతున్నారు. పూర్తి ఫెరఫెక్షన్ కోసం పరితపిస్తున్నారు. యాక్షన్ సినిమాలు చేస్తే అందుకు బ్యాంకాంక్ వంటి చోటుకు వెళ్లి అక్కడ స్టంట్ మాస్టర్స్ తో  ప్రాక్టీస్ చేసి మరీ  ప్రిపేర్ అవుతున్నారు. హిస్టారికల్ మూవీస్ చేస్తే గుర్రపు స్వారీలు, కత్తి తిప్పటం వంటివి నేర్చుకుంటున్నారు. అలాగే నాగచైతన్య కూడా తను త్వరలో చేయబోయే చిత్రం ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్నారట. అది తెలుగుకున్న శేఖర్ కమ్ముల చాలా హ్యాపీ ఫీలయ్యారట. 

సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత మరో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఫిదా వంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల ఆ తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. వారి ఇంట్రస్ట్ ని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్ తో సినిమా చేయబోతున్నాడు శేఖర్ కమ్ముల. మజిలీ లాంటి సూపర్ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్య హీరోగా.. తన డైరెక్షన్ లోనే వచ్చిన ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా సినిమా అనౌన్స్ అయింది. 

ఈ సినిమా మొత్తం తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. సినమాలో  నాగచైతన్య ..తెలంగాణా స్లాంగ్ మాట్లాడుతారు. అందుకోసం ఆయన ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయం శేఖర్ కమ్ములకు తెలిసి ఫుల్ ఖుషీ అయ్యారట. 

ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.  

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభం అయిన ఈ సినిమా అతి తక్కువ టైమ్ లోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో షూటింగ్ మొదలు పెట్టి డిసెంబర్ 2019 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హీరో హీరోయిన్లిద్దరూ బల్క్ డేట్స్ కేటాయించారు. దీంతో కేవలం 60 -70 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో నటించే ఇతర ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తారు

Follow Us:
Download App:
  • android
  • ios