Asianet News TeluguAsianet News Telugu

కొత్త ఇంట్లోకి ప్రవేశించిన నాగ చైతన్య ? ఇక నుంచి అక్కడే, లగ్జరీ హౌస్ గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్

ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'కస్టడీ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. మే 12న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 

Naga Chaitanya new luxury house details are viral
Author
First Published Mar 16, 2023, 9:25 PM IST

ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'కస్టడీ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. మే 12న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా నాగ చైతన్య పర్సనల్ లైఫ్ గురించి మరో హాట్ న్యూస్ వైరల్ గా మారింది. 

నాగ చైతన్య తన అభిరుచుకి తగ్గట్లుగా కొత్త ఇల్లు నిర్మించుకుని అందులోకి రీసెంట్ గా గృహప్రవేశం చేసినట్లు ఫిలిం నగర్ లో టాక్. సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే అంత హడావిడి, ఆర్భాటం లేకుండా సింపుల్ గా చైతు తన కొత్త ఇంట్లోకి ప్రవేశించాడట. 

నాగ చైతన్య, సమంత వివాహం తర్వాత ఒక కొత్త ఫ్లాట్ ని కొనుగోలు చేశారు. సీనియర్ నటుడు మురళి మోహన్ కి చెందిన ప్రాపర్టీనే అది. ఈ విషయాన్ని మురళి మోహన్ గతంలో స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ ఇంటిని వేరే వాళ్లకు అమ్ముదామని అనుకుంటున్న సమయంలో నాగ చైతన్య, సమంత వచ్చి అడిగారని.. దీనితో కాదనలేక వారికే ఆ ఇల్లు ఇచ్చినట్లు మురళి మోహన్ తెలిపారు. 

Naga Chaitanya new luxury house details are viral

కొంతకాలం సమంత, నాగ చైతన్య ఆ ఇంట్లోనే కాపురం చేశారు. ఆ తర్వాత విభేదాలతో చైతు విడిపోయిన సంగతి తెలిసిందే. దీనితో ఆ ఫ్లాట్ ని చైతు సమంతకి విడిచిపెట్టి నాగార్జున ఇంట్లోకి వెళ్ళాడట. అయితే చైతు ఎప్పటి నుంచో తన అభిరుచికి తగ్గట్లుగా మోడ్రన్ గా ఉండే మంచి ఇంటిని నిర్మించుకోవాలని అనుకునేవాడట. నాగార్జున ఇంటికి దగ్గర్లోనే ఒక స్థలం కొని చకచకా ఒక లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నాడట చైతు. స్విమ్మింగ్ పూల్, అందమైన గార్డెన్, జిమ్, థియేటర్ ఉండే విలాసవంతమైన ఇంటిని రెడీ చేసుకున్నాడు. ఇటీవల చైతు ఆ ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. తన సామాను మొత్తం మార్చేసుకున్నాడట. ఇక నుంచి చైతు అక్కడే ఉండబోతున్నట్లు టాక్. అయితే చాలా రోజులుగా చై రెండవ పెళ్లి, ప్రేమ గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. 

ఇదిలా ఉండగా అక్కినేని ఫ్యాన్స్ మాత్రం చై మంచి సినిమాలు చేసి కెరీర్ ని సాలిడ్ గా మార్చుకోవాలని కోరుకుంటున్నారు. చై నటిస్తున్న లేటెస్ట్ మూవీ కస్టడీ టీజర్ కొద్ది సేపటి క్రితమే విడుదలైంది. టీజర్ ఉత్కంఠ భరితంగా ఉంటూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios