తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల రిలీజ్ పై సందిగ్దత వీడడం లేదు. కరోనా వచ్చిపడ్డప్పటి నుంచి చిత్ర పరిశ్రమకు ఇబ్బందులు మొదలయ్యాయి. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినప్పటికీ కరోనా భయం ప్రజల్లో ఉండనే ఉంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల రిలీజ్ పై సందిగ్దత వీడడం లేదు. కరోనా వచ్చిపడ్డప్పటి నుంచి చిత్ర పరిశ్రమకు ఇబ్బందులు మొదలయ్యాయి. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినప్పటికీ కరోనా భయం ప్రజల్లో ఉండనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చిత్రాలని థియేటర్స్ లో విడుదల చేస్తే ప్రజలు ఆదరిస్తారా అనే అనుమానాలు నిర్మాతలకు ఉన్నాయి. 

దీనికి తోడు ఏపీలో థియేటర్స్ పై ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో ఉన్న టికెట్ ధరలతో థియేటర్స్ నడపలేమని ఎగ్జిబిటర్లు తేల్చేస్తున్నారు. దీనితో చేసేది ఏమీ లేక కొందరు నిర్మాతలు తమ చిత్రాల్ని ఓటిటికి అమ్మేస్తున్నారు. 

కొందరు మాత్రం ధైర్యం చేసి థియేటర్స్ లో తమ చిత్రాలని రిలీజ్ చేస్తున్నారు. ఎప్పుడో పూర్తయిన శేఖర్ కమ్ముల, నాగ చైతన్య చిత్రం లవ్ స్టోరీ మూవీ రిలీజ్ కి సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు. 

ఈ సారి రిలీజ్ పక్కా అనుకుంటున్న తరుణంలో ఈ చిత్రం మరోసారి వాయిదా పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. క్రేజీ చిత్రాలు సైతం ఓటిటి బాట పడుతున్న తరుణంలో లవ్ స్టోరీ రిలీజ్ సరైనది కాదని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఏపీలో థియేటర్స్ సమస్య ఎలాగు ఉంది. దీంతో కలెక్షన్స్ పై తప్పకుండా ప్రభావం ఉంటుంది. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దలు ఎపి ముఖ్యమంత్రి జగన్ ని మీట్ కాబోతున్నారు. ఏపీలో థియేటర్స్ సమస్య, టికెట్ ధరలు, టాలీవుడ్ సమస్యలపై చర్చ జరగనుంది. ఈ మీటింగ్ పూర్తయ్యే వరకు ఎదురుచూస్తే బావుంటుంది అనే ధోరణిలో లవ్ స్టోరీ నిర్మాతలు ఉన్నారట. 

కాబట్టి లవ్ స్టోరీ చిత్రం సెప్టెంబర్ చివరకు కానీ అక్టోబర్ కి కానీ పోస్ట్ పోన్ కాబోతోందనేది లేటెస్ట్ న్యూస్. లవ్ స్టోరీ పోస్ట్ పోన్ కానుండడంతో సెప్టెంబర్ 10 స్లాట్ ఖాళీ కానుంది. ఆ ప్లేస్ లో గోపీచంద్ సీటిమార్ మూవీ రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న రిలీజ్ చేయాలని ముందుగా ప్రకటించారు. లవ్ స్టోరీ, సీటీమార్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.