Asianet News TeluguAsianet News Telugu

ఫస్ట్ టైమ్ నెగిటివ్ రోల్ చేస్తున్నా: నాగచైతన్య

శేఖర్ కమ్ముల తో చేసిన లవ్ స్టోరీలోనూ నాగ చైతన్య మంచి నటన చేయటానికి, నాచురల్ గా సీన్స్ చేయటానికి అవకాసం దొరికింది. దాంతో ఇప్పుడు నాగచైతన్య నెగిటివ్ పాత్ర ఉన్న కమిటయ్యారు. 

Naga Chaitanya In A Negative Role in web series!
Author
Hyderabad, First Published Sep 23, 2021, 7:25 AM IST

సినిమాలు సక్సెస్ అయితే చాలు అనుకునే స్దాయి నుంచి తన ఫెరఫార్మన్స్ కూడా సినిమాలో హైలెట్ అవ్వాలనుకునే స్దాయికి నాగచైతన్య ఎదిగారు. హీరో పాత్రల్లో ఎక్కువగా ఫెరఫెర్మాన్స్ అవకాసం ఉండదు. కథ ప్రకారం చేసుకుంటూ పోతే చాలు. కానీ అభినయం కావాలంటే అది నెగిటివ్ రోల్స్ లో దొరుకుతుంది. అందుకే ఒక్కోసారి హీరోలు తమ ఇమేజ్ ని ప్రక్కన పెట్టి అలాంటి పాత్రలు కోసం ప్రాణం పెట్టడానికి ముందుకు వస్తారు. అలాంటి  డెసిషన్ నాగచైతన్య తీసుకున్నాను అని చెప్తున్నారు.

మజిలీ తర్వాత నాగచైతన్య ఎంపికలో మార్పు వచ్చింది. ఆ సినిమా తర్వాత చైతూ నటనకు అవకాసం ఉండే పాత్రల వైపు మ్రొగ్గుచూపుతున్నారు. రొటీన్ ఫిల్మ్ లు చేయటానికి ఆసక్తి చూపడటం లేదు. వాటి వల్ల తన కెరీర్ కు పెద్దగా కలిసొచ్చేదేమీ లేదని భావిస్తున్నారు. దానికి తోడు శేఖర్ కమ్ముల తో చేసిన లవ్ స్టోరీలోనూ నాగ చైతన్య మంచి నటన చేయటానికి, నాచురల్ గా సీన్స్ చేయటానికి అవకాసం దొరికింది. దాంతో ఇప్పుడు నాగచైతన్య నెగిటివ్ పాత్ర ఉన్న కమిటయ్యారు. ఈ విషయం స్వయంగా చైతన్యే మీడియాకు తెలియచేసారు. లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ బాలీవుడ్ సైట్ తో మాట్లాడుతూ ఈ విషయం రివీల్ చేసారు.

నాగచైతన్య మాట్లాడుతూ...“మొదటిసారిగా నేను ఓ నెగిటివ్ రోల్ చేస్తున్నాను. కథ చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఈ పాత్రను ఓటీటి కోసం చేస్తున్నాను. అక్కడయితేనే ఇలాంటి ప్రయోగాలు చేయగలం. ఎందుకంటే నేను నెగిటివ్ పాత్ర చేస్తున్నాను అంటూ ఏ నిర్మాతను ప్రొడ్యూస్ చేయమని అడగలేను. నేను స్వయంగా ప్రొడ్యూస్ చేయలేను. అందుకే ఓటీటికే ఈ ప్రయోగాన్ని పరిమితం చేసాను ,” అన్నారు నాగచైతన్య.

ఇక ఈ నెగిటివ్ రోల్ చేస్తోంది అమేజాన్ ప్రైమ్ కోసం. అది ఓ హారర్ వెబ్ సీరిస్. విక్రమ్ కుమార్ ఈ ప్రాజెక్టుని డైరక్ట్ చేస్తున్నారు. ప్రతీ నటుడుకి ప్రయోగాలు చేయాలని ఉంటుంది. కానీ కుదరదు. ఆ ఆలోచనలను ఓటీటి ముందుకు తీసుకు వెళ్తుంది. రెగ్యులర్ చేయలేనివి ఓటీటిలో చేయచ్చు అన్నారు నాగచైతన్య.

ఇక నాగచైతన్య తాజా చిత్రం ‘లవ్ స్టోరి’ ఈ శుక్రవారం రిలీజవుతోంది.  ఈ చిత్రానికి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జరుగుతోంది. వీటిని చూస్తుంటే ఈ వీకెండ్ లో థియేటర్లకు పాత కళ వస్తోందనిపిస్తోంది.  చాలా కాలం తర్వాత థియేటర్ల ముందు పెద్ద ఎత్తున హౌస్ ఫుల్ బోర్డులు కనిపించబోతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios