Asianet News TeluguAsianet News Telugu

విడిపోయాక సమంత ఉండబోతోంది అక్కడే, చైతూ మాత్రం...

..సోషల్ మీడియాలో విడిపోతున్నామని ప్రకటించక ముందు నుంచే సమంత, నాగచైతన్య విడివిడిగా ఉంటున్నారు. సమంత హైదరాబాద్ గచ్చిబౌళిలోని అపార్మటెంట్ ని తనకే ఉంచేసుకుంది. అందుకుముందు వీళ్లిద్దరు అందులో కలిసి ఉండేవారు. 

Naga Chaitanya buys a new apartment
Author
Hyderabad, First Published Oct 11, 2021, 8:36 AM IST

 సమంత, చైతన్య వారి పెళ్లి బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలు నిజమంటూ రీసెంట్ గా నాగచైతన్య,సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చేసిన పోస్టుతో తెలిసిపోయింది.ఇన్ని రోజులు భార్యాభర్తలుగా కొనసాగుతున్న తామిద్దరం విడిపోతున్నామని, ప్రస్తుతం ఎవరి దారి వారం చూసుకోబోతున్నామని.. గత పది సంవత్సరాల నుంచి మంచి స్నేహ బంధంతో ఉండి పెళ్లి బంధంతో ఒక్కటైన తాము ఇకపై ఎవరిదారి వారు చూసుకోబోతున్నామని తెలియజేశారు. ఈ నేపధ్యంలో ఇన్నాళ్లు కలిసి ఉన్న వాళ్లు విడిపోయి ఎక్కడ ఉండబోతున్నారనే విషయం మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం మేరకు...సోషల్ మీడియాలో విడిపోతున్నామని ప్రకటించక ముందు నుంచే సమంత, నాగచైతన్య విడివిడిగా ఉంటున్నారు. సమంత హైదరాబాద్ గచ్చిబౌళిలోని అపార్మటెంట్ ని తనకే ఉంచేసుకుంది. అందుకుముందు వీళ్లిద్దరు అందులో కలిసి ఉండేవారు. ఇక నాగచైతన్య గత సంవత్సరం జూబ్లిహిల్స్ లో ఓ పెద్ద బంగ్లా కొన్నారు. తామిద్దరం అందులోని వెళ్దామనుకున్నారు. ఆ బంగ్లాకు  రెనొవేష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. . అది రెడీ అయ్యేందుకు ఇంకో ఏడాది సమయం పట్టేటట్లు ఉంది. అప్పుడు చైతూ ఆ బంగ్లాలోకి వెళ్తారట. మరి ఈ లోగా ఉండటానికి ఓ పోష్ లొకాలిటీలో ఉన్న మరో అపార్టమెంట్ కు షిప్ట్ అవుతున్నారట. ప్రస్తుతం ఓ స్టార్ హోటల్ లో చైతు ఉంటున్నారని సమాచారం.

Also read MAA Elections: రాజకీయ లబ్ధి కోసం అలా చేస్తున్నారు.. పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు
   
సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల చైతన్య నటించిన ‘లవ్‌స్టోరీ’ మూవీ ఇటీవల విడుదల కాగా, సమంత ‘శాకుంతలం’ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతుంది.‘లవ్‌స్టోరీ’ సినిమా తర్వాత నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ‘థాంక్యూ’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది.నాగచైతన్య మొదటి సారి హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. గతంలో ‘మజిలీ’ సినిమాలో క్రికెటర్ గా కనిపించి మెప్పించాడు చైతన్య. ఇక ‘థాంక్యూ’ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తుంది. నాగచైతన్య విక్రమ్ కుమార్ కాంబినేషన్లో గతంలో ‘మనం’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీకి ఓ బ్యూటీఫుల్ మెమొరీగా మిగిలిపోయింది. ఇక ‘థాంక్యూ’ సినిమాను శరవేగంగా షూట్ చేస్తున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios