Asianet News TeluguAsianet News Telugu

చావు నన్ను వెంటాడుతోంది .. అది ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు

నిజం ఒక ధైర్యం. నిజం ఒక సైన్యం. యస్‌ దట్‌ ట్రూత్‌ ఇన్‌ మై కస్టడీ’ అంటూ నాగచైతన్య డైలాగ్స్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయి. 

Naga Chaitanaya Custody teaser released
Author
First Published Mar 16, 2023, 5:59 PM IST


నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు ఒక సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసందే. కస్టడీ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం కెరియర్ పరంగా చైతూకి ఇది 22వ ది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా టీజర్  ను ఈ రోజున రివీల్ చేసారు. 

కీ రోల్స్  పై కట్ చేసిన టీజర్ ఆసక్తిని రేపుతోంది. ‘గాయ పడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అది ఇప్పుడు తీసుకొచ్చింది ఓ యుద్ధానికి. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది. అది ఎటు నుంచి వస్తుందో, ఎప్పుడోస్తుంది, ఎలా వస్తుందో నాకు తెలియదు. తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే నా చేతిలో ఉన్న ఆయుధం ఒక నిజం. నిజం ఒక ధైర్యం. నిజం ఒక సైన్యం. యస్‌ దట్‌ ట్రూత్‌ ఇన్‌ మై కస్టడీ’ అంటూ నాగచైతన్య డైలాగ్స్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయి. టీజర్‌తోనే సినిమాపై ఓ రేంజిలో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ముఖ్యంగా ఇళయరాజా, యువన్‌ శంకర్‌రాజాల బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఓ ట్రాన్స్‌లోకి తీసుకెళ్లింది.
 
చైతూ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. 'బంగార్రాజు' తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. ఇళయరాజా .. ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి సంగీతాన్ని అందించడం విశేషం. అరవింద్ స్వామి .. శరత్ కుమార్ .. సంపత్ రాజ్ .. ప్రియమణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనునున్నారు.
 విలన్ పాత్రలో అరవింద్‌ స్వామి నటిస్తున్నాడు. నటి ప్రియమణి కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సినిమా సమ్మర్‌ కానుకగా మే 12న తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో విడుదల కానుంది.  'థ్యాంక్యూ' ఫలితంతో నిరాశలో ఉన్న చైతూకి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి.
 

Follow Us:
Download App:
  • android
  • ios