నాగ్ 'మన్మథుడు-2' రివ్యూ !
గతంలో వచ్చిన హిట్ సినిమా ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకున్నప్పుడు పుట్టే ఐడియానే సీక్వెల్. అయితే చాలా సీక్వెల్స్ ..అంతకు ముందు సినిమా ఎక్కడ ఆగిందో ...ఆ తర్వాత వారి జీవితంలో ఏం జరిగింగో చెప్పటానికి ప్రయత్నిస్తూంటాయి. మరికొన్ని టైటిల్ సీక్వెల్ అంటే కేవలం టైటిల్ కు మాత్రమే సీక్వెల్ ఉంటుంది. అంతకు మించి మొదట సినిమాతో ఈ సీక్వెల్ కు ఏ సంభందం ఉండదు. అలాంటి టైటిల్ సీక్వెల్ సినిమానే 'మన్మథుడు-2'.
గతంలో వచ్చిన హిట్ సినిమా ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకున్నప్పుడు పుట్టే ఐడియానే సీక్వెల్. అయితే చాలా సీక్వెల్స్ ..అంతకు ముందు సినిమా ఎక్కడ ఆగిందో ...ఆ తర్వాత వారి జీవితంలో ఏం జరిగింగో చెప్పటానికి ప్రయత్నిస్తూంటాయి. మరికొన్ని టైటిల్ సీక్వెల్ అంటే కేవలం టైటిల్ కు మాత్రమే సీక్వెల్ ఉంటుంది. అంతకు మించి మొదట సినిమాతో ఈ సీక్వెల్ కు ఏ సంభందం ఉండదు. అలాంటి టైటిల్ సీక్వెల్ సినిమానే `మన్మథుడు-2` . ఫ్రెంచ్ లో వచ్చి విజయవంతమైన I Do (2006) సినిమా రీమేక్ గా రూపొందిన ఈ సినిమా ఎంతవరకూ మన ప్రేక్షకులను ఆకట్టుకుంది. `మన్మథుడు-2` అని టైటిల్ పెట్టడానికి కారణం వేరే ఏమైనా ఉందా.... త్రివిక్రమ్ స్దాయిలో జోక్స్ ని ఈ సినిమా నుంచి ఎక్సపెక్ట్ చేయచ్చా... వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ ఏంటి..?
సాంబశివరామ్ ఉరఫ్ సామ్ (నాగార్జున) పోర్చుగల్ లో సెటిలైన ఓ తెలుగు ఫ్యామిలికి చెందిన వాడు. ఫ్లాష్ బ్యాక్ లో తన లవ్ ఫెయిల్యూరు అవటంతో ప్లే బోయ్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూంటాడు. ఆ కాన్సెప్టులో భాగంగా ప్రేమ, పెళ్లి వంటివాటికి దూరంగా ఉంటాడు. జీవితంలో ఎప్పటికి పెళ్లి చేసుకోకూడదు అని డిసైడ్ అతనికి తన తల్లి, కుటుంబ వ్యక్తుల పట్టుదలతో పెళ్లికి ఓకే అనాల్సి వస్తుంది. అయితే పెళ్లి చేసుకోవటం ఇష్టం ఉండదు. ఇంట్లో వాళ్లని నొప్పించకూడదు...తను సఫర్ అవకూడదు అని ఓ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అవంతిక(రకుల్ ప్రితి సింగ్) అనే అమ్మాయిని ..గంటకు ఇంత అని మాట్లాడి తన గర్ల్ ఫ్రెండ్ గా నటించటానికి తన ఇంటికి తీసుకు వస్తాడు. అక్కడ నుంచి ఏం జరిగింది. మెల్లి మెల్లిగా అవంతికతో సామ్ ఎలా ప్రేమలో పడ్డాడు... వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఆ పాత కథే...
ఇంట్లో వాళ్లు పెళ్లికి పట్టుబడితోనే లేక వేరే కారణం చేతో ...ఓ అబ్బాయి లేదా అమ్మాయిని డబ్బుకు మాట్లాడుకుని తీసుకువచ్చి ఇంట్లో వాళ్లకు పరిచయం చేయటం,గొడవలు,చివరకు వాళ్లతోనే ప్రేమలో పడటం వంటి కథలు మన తెలుగు సినిమాకు కొత్తేమీ కాదు. అప్పట్లో చిరంజీవి హీరోగా వచ్చిన మొగడు కావాలి నుంచి నిన్న మొన్నటి సుకుమారుడు వరకూ ఇలాంటి కథలు ఎన్నో తెలుగు తెర చూసేసింది. అయితే అవి మరీ ప్రెడిక్టుబుల్ గా ఉంటున్నాయని అనిపించటంతో ఈ మధ్యకాలంలో ప్రక్కన పెట్టింది. దాన్ని నాగ్ ఈ కాలం కథ అనుకుని రైట్స్ కొనుక్కుని మరీ చేయటమే వింత. ఆయన చూడానికి యంగ్ గా ఉన్నా ఆయన ఐడియాలు మాత్రం ఆ కాలంలోనే ఆగాయా అని అనిపిస్తుంది ఈ సినిమా చూస్తూంటే.
ఇదో విచిత్రం...
2013లో నాగ్ హీరోగా గ్రీకు వీరుడు చిత్రం వచ్చింది. ఆ సినిమాలోనూ ఇదే కథ. అప్పట్లో ఈ ప్రెంచ్ సినిమాని ఫ్రీ మేక్ చేసారని చెప్పుకున్నారు. ఆ సినిమాలో నాగ్ ది ప్లే బోయ్ క్యారక్టరే. తన ఇంట్లో వాళ్ల పోరు పడలేక నయనతార ను డబ్బుకు మాట్లాడుకుని తన కాబోయే భార్యగా ఇంటికి తీసుకువస్తాడు. అక్కడ నుంచి ఆ నాటకం ఆడుతూ ..ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అయితే ఆ పడిపోవటం..పడిపోవటం ఇక లేవకపోవటంతో కథ ప్లాఫూరు వెళ్లింది. అయితే ఇక్కడ ఒరిజనల్ సినిమా రైట్స్ కొనుక్కుని చేయటంతో..పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం రాలేదు. దాంతో ఒరిజనల్ లో ఉన్న ఎమోషన్స్ ని, ఫన్ ని ఇక్కడ క్యారీ చేయగలిగారు. అది ప్లస్ అయ్యింది. అంతకు మించి పెద్దగా తేడా ఏమీ లేదు.
ఏదైమైనా ఒకే కథను కొద్ది సంవత్సరాల తేడాతో అదే హీరో చేయటం అనేది చెప్పుకోదగ్గ విషయమే. ఇది హిట్టైతే...తన పాత ప్లాఫ్ లను మరోసారి సరిచేసి కొత్త సరుకు గా ప్రెజెంట్ చేయచ్చు.
కథ, కథనం..
దాదాపు పన్నేండేళ్ల క్రితం వచ్చిన `మన్మథుడు` సినిమా ఇప్పటికీ టీవీల్లో వచ్చినా జనాలు చూస్తూనే ఉన్నారు అంటే త్రివిక్రమ్ పంచ్ డైలాగులు, విజయ్ భాస్కర్ దర్శకత్వం, బ్రహ్మానందం కామెడీ మర్చిపోలేకపోవటమే. ఈ సీక్వెల్ లో అవే మిస్సయ్యాయి. దర్శకుడుగా రాహుల్ రవీంద్ర..సినిమాని డైలాగులతో..అప్పటికప్పుడు వచ్చే కాంప్లిక్ట్ తో అక్కడక్కడ ద్వందార్దాలుతో నడిపేయాలనుకున్నారు కానీ సినిమాలో ప్రధాన కథ మనకు కనెక్ట్ అవుతుందా లేదా...స్క్రీన్ ప్లే స్టాప్ అండ్ స్టార్ట్ అన్నట్లుగా సాగుతోంది ఇబ్బంది అవదు కదా అని ఆలోచించినట్లు లేరు. ప్రెంచ్ సినిమా వచ్చిన 2006 లో తెలుగులో రైట్స్ కొని చేసి ఉంటే ఫెరఫెక్ట్ గా సింక్ అయ్యేది. ఇప్పటికి ఈ కథ స్టేల్ అయ్యిపోయింది. హీరో,హీరోయిన్స్ క్యారక్టర్స్ లో కానీ వాళ్ల మధ్య జరిగే సంఘటనలలో కాని ఎక్కడా డెప్త్ లేదు. ఫార్స్ తో నడిచే ఈ కథలో వెన్నెల కిషోర్ కామెడీ ఒకటే అదీ ఫస్టాఫ్ లో వర్కవుట్ అయ్యింది. సెకండాఫ్ లో అదీ లేదు. మరీ ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే గంజాయి ఎపిసోడ్స్ లాంటివి..ఇంకా ఈ రోజుల్లో చూడాలి అంటే చాలా కష్టపడాలి.
టెక్నికల్ గా..
ఈ సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. కెమెరా వర్క్ పోర్చుగీస్ అందాలను బాగా పట్టుకుంది. సంగీతం సూపర్ కాదు కానీ గుడ్. ఎడిటింగ్ మాత్రం ఫస్టాఫ్ లెంగ్త్ ఎక్కువై ఫుల్ సినిమా చూసిన ఫీల్ వచ్చింది. దాన్ని తగ్గించవచ్చేమో. సెకండాఫ్ లోనూ అదే పరిస్దితి. మినిమం ఓ ఇరవై నిముషాలు దాకా తీసేస్తా కానీ ఆ నీరసం తగ్గదు. ఈ సినిమా హైలెట్స్ లో నాగ్, రకుల్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించే చెప్పుకోవాలి. అవి సూపర్బ్ గా ఉన్నాయి. దర్శకుడుగా రాహుల్ రవీంద్రన్ ..ఇలాంటి డల్ సినిమా తీస్తాడని ఊహించం. ఆ పాపం ..రీమేక్ దేనేమో. డైలాగులు సినిమాకు కొంచెం కూడా ప్లస్ కాలేదు. విసుగెత్తించాయి చాలా చోట్ల.
ఫైనల్ థాట్
రెండు సార్లు 'మన్మధుడు' ని చూడాలి.
Rating:2/5
తెర వెనక , ముందు ..
నిర్మాణ సంస్థలు: మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 స్టూడియోస్
నటీనటులు: నాగార్జున అక్కినేని, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మి, వెన్నెలకిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు
మాటలు: కిట్టు విస్సా ప్రగడ, రాహుల్ రవీంద్రన్
కూర్పు: ఛోటా కె.ప్రసాద్, బి.నాగేశ్వర రెడ్డి
కథనం: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్
కళ: ఎస్.రామకృష్ణ, మౌనిక
సంగీతం: చైతన్య భరద్వాజ్
ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్
నిర్మాతలు: నాగార్జున అక్కినేని, పి.కిరణ్
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్