Asianet News TeluguAsianet News Telugu

ఇస్మార్ట్ శంకర్ కి జోడీగా క్రేజీ హీరోయిన్

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే

Nabha Natesh to romance Ram in ismart shankar
Author
Hyderabad, First Published Jan 28, 2019, 11:00 AM IST

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా ఇటీవలే మొదలైంది. కాగా.. ఈ సినిమాకి ఇప్పుడు హీరోయిన్ దొరికిందట.

ఫస్ట్ ఈ సినిమాలో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు అను ప్లేస్ లోకి మరో క్రేజీ హీరోయిన్ అడుగుపెట్టింది. ‘ నన్నో దోచుకుందువటే’’ సినిమాలో తన నటతో ఆకట్టుకున్న నభా నటేష్ ఈ సినిమాలో రామ్ తో రొమాన్స్ చేయనుంది. చాలా మంది హీరోయిన్లను పరిశీలించిన పూరీ.. చిట్టచివరకు నభా నటేష్ ని ఫైనల్ చేశాడట.

ఇక ఈ చిత్రంలో రామ్ న్యూ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించనుండగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందించనున్నారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ‘మే’లో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios