Asianet News TeluguAsianet News Telugu

ఇస్మార్ట్ శంకర్: హైదరాబాద్ ఇస్మార్ట్ పోరి దొరికేసింది!

సక్సెస్ కోసం కష్టపడుతున్న హీరో దర్శకుడికి ఇప్పుడు క్రేజ్ బాగానే పెరుగుతోంది. ఊర మాస్ లో పక్కా హైదరాబాద్ స్టైల్ లో మొదలెట్టిన ఇస్మార్ట్ శంకర్ సినిమాపై రోజురోజుకి అంచనాలు గట్టిగానే పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు సినిమాకు సంబందించిన నటీనటుల ఎంపిక విషయంలో పూరి జగన్నాథ్ కొత్తగా ప్రచారం చేస్తున్నారు. 

nabha natesh in ismart shankar
Author
Hyderabad, First Published Jan 31, 2019, 4:09 PM IST

సక్సెస్ కోసం కష్టపడుతున్న హీరో దర్శకుడికి ఇప్పుడు క్రేజ్ బాగానే పెరుగుతోంది. ఊర మాస్ లో పక్కా హైదరాబాద్ స్టైల్ లో మొదలెట్టిన ఇస్మార్ట్ శంకర్ సినిమాపై రోజురోజుకి అంచనాలు గట్టిగానే పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు సినిమాకు సంబందించిన నటీనటుల ఎంపిక విషయంలో పూరి జగన్నాథ్ కొత్తగా ప్రచారం చేస్తున్నారు. 

ఇస్మార్ట్ శంకర్ కి ఇప్పటికే మోడ్రన్ గా ఉండే ఒక క్యారెక్టర్ కోసం నిధి అగర్వాల్ ని సెలెక్ట్ చేసిన పూరి జగన్నాథ్ మరో పిల్లను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ కి సమానంగా పోటీపడే హైదరాబద్ పిల్లగా నభా నటేష్ ను సెలెక్ట్ చేశారు. నన్ను దోచుకుందువటే సినిమాతో గత ఏడాది టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే అందరిని ఆకర్షించింది. 

ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ లో రామ్ సరసన నటించడానికి సిద్ధమైంది. ఇటీవల మొదలైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ మరికొన్ని రోజుల్లో ఎండ్ కానుంది. పూరి తరహాలో మాస్ యాక్షన్ ఎపిసోడ్ లు ఈ సినిమాలో ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ఇదే ఏడాది ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.      

Follow Us:
Download App:
  • android
  • ios