Asianet News TeluguAsianet News Telugu

'జార్జిరెడ్డి' బయోపిక్, ప్రీలుక్ పోస్టర్‌ ఇదిగో..!

తెలుగులో వరస పెట్టి బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే దివంగత సావిత్రి, ఎన్టీఆర్ ల బయోపిక్ లు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. అతి త్వరలోనే యాత్ర టైటిల్ తో రూపొందిన  వైయస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ విడుదల కానుంది. 

Movie on famous student activist George Reddy
Author
Hyderabad, First Published Jan 16, 2019, 7:49 AM IST

తెలుగులో వరస పెట్టి బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే దివంగత సావిత్రి, ఎన్టీఆర్ ల బయోపిక్ లు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. అతి త్వరలోనే యాత్ర టైటిల్ తో రూపొందిన  వైయస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ విడుదల కానుంది. ఈ నేఫధ్యంలో ఇప్పుడు మరో బయోపిక్ తెరకెక్కుతోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా పేరొందిన జార్జిరెడ్డి బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో జార్జి రెడ్డి పాత్రను 'వంగవీటి ఫేమ్' శాండీ పోషిస్తున్నారు. 

హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన జార్జిరెడ్డిని చాలా చిన్న వయసులోనే కొందరు ప్రత్యర్థులు క్యాంపస్ లోనే హత్య చేశారు. ఇప్పుడు ఆ  విద్యార్థి నేత జీవితం వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది.  తాజాగా  ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్ విడుదలైంది. 

జార్జిరెడ్డి అనగానే విపరీతమైన పఠనాసక్తి కలిగిన వాడు అని ఆయన మిత్రులు నేటికీ చెబుతుంటారు. ఆ విషయాన్నే ప్రతిబింబిస్తూ చేతిలో పుస్తకాలతో నాటి కాలపు డ్రెస్సింగ్ స్టైల్‌తో కాలేజ్‌కు నడిచి వెళుతోన్న ‘‘జార్జిరెడ్డి’’ లుక్‌ను విడుదల చేశారు. అతి త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు నటీనటుల వివరాలు తెలియజేస్తామని దర్శక నిర్మాతలు అన్నారు. ‘‘మీట్ ద ఫర్ గాటెన్ లీడర్ సూన్’’ అనే టైటిల్‌తో పాటు ‘‘ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్’’ అనే క్యాప్షన్ కూడా ఈ పోస్టర్‌లో ఉంది.  ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

సినిమాటోగ్రఫీ: సుధాకర్ రెడ్డి యెక్కంటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, పీఆర్వో: జీ.ఎస్.కే మీడియా, నిర్మాతలు: అప్పిరెడ్డి, దామురెడ్డి కొసనం, రచన, దర్శకత్వం: జీవన్ రెడ్డి.

Follow Us:
Download App:
  • android
  • ios