‘మోస‌గాళ్లు’ ముంచేసిందా, మోహన్ బాబు పూచికత్తా?

నిజ జీవితంలో జరిగిన ఓ భారీ ఐటీ కుంభ‌కోణాన్ని కథాంశంగా తీసుకొని.. ‘మోస‌గాళ్లు’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తీసుకొచ్చారు మంచు విష్ణు. ఇందులో విష్ణు, ఆయ‌న సోద‌రిగా కాజ‌ల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించ‌డం.. బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి ఓ కీల‌క‌ పాత్రలో న‌టించ‌డంతో అంద‌రి దృష్టి ఈ సినిమాపై ప‌డింది.  అలాగే టీజ‌ర్‌, ట్రైల‌ర్లు ఇంట్రస్టింగ్ గా ఉండ‌టంతో.. ఈ  సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. అయితే ఆ అంచ‌నాల్ని ఈ ‘మోస‌గాళ్లు’ అందుకోలేకపోయింది?  మంచు విష్ణుకి విజ‌యం ద‌క్కలేదు. ఈ నేపధ్యంలో ఈ సినిమాపై ఎంత పెట్టారు...ఎంత పోయింది అనే విషయాలు మీడియాలో చర్చనీయాశంగాలు మారాయి. 
 
Mosagallu movie huge disater jsp

 ఆర్థిక కుంభ‌కోణాల చుట్టూ అల్లుకున్న క్రైమ్  థ్రిల్ల‌ర్ కథలు ఎప్పుడూ ఇంట్రస్టింగ్ గానే ఉంటాయి. అందులోనూ టెక్నాల‌జీతో ముడిప‌డి ఉండే స్కాం గురించి అంటే తెలుసుకోవటానికి మరింత ఉత్సాహం చూపిస్తారు.  ఈ త‌ర‌హా క‌థాంశాలతో హాలీవుడ్‌లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలొచ్చాయి. అలాగే బాలీవుడ్‌లో ఇప్ప‌టికే హ‌ర్ష‌ద్ మెహ‌తా స్టాక్ ఎక్స్ఛేంజ్‌ కుంభ‌కోణంతో ‘స్కామ్ 1992’ వెబ్‌సిరీస్‌తో పాటు ‘బిగ్ బుల్’ అనే సినిమాలు రూపొందాయి.  అదే ఓ య‌థార్థ‌మైన ఆర్థిక కుంభ‌కోణం కథాంశంగా తీసుకుని ‘మోస‌గాళ్లు’తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశారు మంచు విష్ణు.  ఇది నిజంగా సాహ‌సోపేత‌మైన ప్ర‌య‌త్న‌మే.  విష్ణు ఎంచుకున్న ఈ పాయింట్‌లోనే ఓ కొత్త‌ద‌నం ఉంది అని అందరూ మెచ్చుకున్నారు. అయితే ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది ఈ సినిమా. 

తనే సొంతంగా 50 కోట్లు పెట్టుబడి పెట్టి, కాజల్ లాంటి హీరోయిన్ ని, సునీల్ శెట్టి లాంటి నటుడిని తీసుకుని మోసగాళ్లు సినిమాని చేసినా ఫలితం లేకుండా పోయింది.  అందులో 15 కోట్లు ఫైన్సాన్స్ తీసుకుని చేసిందే అని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అలాగే  సినిమా రిలీజ్ కు ముందే ఫైనాన్స్ క్లియ‌ర్ చేయాలి. సినిమాని అమ్ముకుని, ఆ డ‌బ్బుల‌తో క్లియ‌రెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకుని రిలీజ్ చేస్తారు. మరీ బిజినెస్ కాకపోతే క‌నీసం థియేట‌ర్ల నుంచి వ‌చ్చిన అడ్వాన్సుల‌తో అయినా.. ఫైనాన్షియ‌ర్ల‌కు కొద్దిగా చెల్లించి, మిగతాది నోటు రాసుకుంటారు. అయితే `మోస‌గాళ్లు` సినిమా ఎవ‌రూ కొన‌లేదు. విష్ణునే సొంతంగా విడుద‌ల చేశారు. మోహ‌న్ బాబు సొంత పూచీక‌త్తుపై.. ఈ సినిమా విడుద‌లైందని చెప్తున్నారు. చివ‌రి క్ష‌ణాల్లో మోహ‌న్ బాబు ముందుకొచ్చి, విష్ణుకి లైన్ క్లియ‌ర్ చేశాడ‌ని చెప్తున్నారు. 
 
ఇక  ఈ మోసగాళ్లకు   నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి, సినిమాలో విషయం లేదని తేల్చేసారు. శుక్రవారం ఫస్ట్ షో కే మోసగాళ్ల విషయం తెలుసుకుని ప్రేక్షకులు సైలెంట్ అయ్యారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందు ఎవరూ కొనకపోతే మంచు విష్ణు నే డైరెక్ట్ గా కొన్ని చోట్ల విడుదల చేసాడట. ఇప్పుడు చూస్తే థియేటర్స్ అడ్వాన్స్ లు కూడా వచ్చేలా కనిపించడం లేదు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్ముదామని ఆగారు. ఇప్పుడు చూస్తే మొదటికే మోసం వచ్చింది. పాన్ ఇండియా లెవల్లో సినిమాని విడుదల చేసి మంచు విష్ణు నిండా మునిగిపోయాడని అంటున్నారు. అయితే తెలుగుతో పాటు అన్ని భాష‌ల్లోనూ ఈ సినిమాని డ‌బ్ చేశారు కాబ‌ట్టి.. ఓటీటీ, శాటిలైట్ బేరాలు వ‌చ్చే అవ‌కాశం ఉందని చెప్తున్నారు. కొంతలో కొంతైనా మోస‌గాళ్ల‌ని అవి గ‌ట్టెక్కిస్తాయేమో చూడాలి. ‌ 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios