వీకెండ్ కావడంతో నేడు బిగ్ బాస్ షోలో కింగ్ నాగార్జున సన్ది చేయాల్సి ఉంది. ఐతే కింగ్ నాగార్జున మాత్రం షోని స్టార్ట్ చేయలేదు. దానికి కారణం ఆయన వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం కులు మనాలి వెళ్లారు. షో బిగినింగ్ లోనే ఈ విషయాన్ని నాగార్జున తెలియజేశారు. వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం రోహ్ తంగ్ పాస్ లో 3000 అడుగుల పైన షూటింగ్ చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా మిస్ అవుతున్న నేపథ్యంలో నిర్వాహకులు సరికొత్తగా సిద్ధం చేశారు.ఇంటి సభ్యులతో  ప్రేమ మొదలైంది అనే సినిమా నిర్మించిన బిగ్ బాస్ అఖిల్ మరియు  మోనాల్ మధ్య మంచి లవ్ ట్రాక్ సెట్ చేశారు. మోనాల్-మోనాల్ రొమాన్స్ కట్టిపడేసింది. 

ప్రేమ మొదలైంది స్క్రిప్ట్ లో ఓ  లవ్ సీన్ లో మోనాల్ తన కోసం హౌస్ లో చాలా మంది లైన్ ఉన్నారని చెప్పారు. ఇంటి సభ్యులకి తనకు చాలా మంది లైన్ వేస్తున్నట్లు ఆమె డైరెక్ట్ గా చెప్పేసింది. ఇప్పటికే హౌస్ లో అఖిల్ మరియు అభిజిత్ ఆమె కోసం ఆరాట పడుతుండగా...అవినాష్ కూడా ఈ లిస్ట్ లో చేరాడు. స్క్రిప్ట్ డైలాగ్ చెప్పినప్పటికీ మోనాల్ మాట నిజమే కదా అనిపించేలా ఉంది. 

ఈ వారం మోనాల్ హౌస్ నుండి వీడనుంది వార్తలు రావడం జరిగింది. వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం వెళ్లిన నాగార్జున ఈవారం బిగ్ బాస్ హౌస్ ని మిస్ కావడం జరిగింది. రేపు నాగార్జున ప్లేస్ లో సమంత కనిపించనుంది. కింగ్ నాగార్జున బాధ్యతలు తీసుకున్న సమంత మరి హౌస్ నుండి ఒకరి ఎలిమినేట్ చేయనుందో లేదో చూడాలి.