ఇండియన్ కంప్లీట్ యాక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న మోహన్ లాల్ ఎప్పటికపుడు తన సినిమాలతో సర్ ప్రైజ్ చేస్తుంటారు.

ఇండియన్ కంప్లీట్ యాక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న మోహన్ లాల్ ఎప్పటికపుడు తన సినిమాలతో సర్ ప్రైజ్ చేస్తుంటారు. మలయాళం సినిమా ఇండస్ట్రీలో 100 కోట్ల మార్కెట్ ఉందని నిరూపించిన ఈ యాక్టర్ ఇతర బాషల నుంచి కూడా మంచి ఆదరణను అందుకుంటున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక నెక్స్ట్ మోహన్ లాల్ నుంచి వస్తోన్న ప్రయోగాత్మక చిత్రం ఒడియన్. ఈ సినిమా కోసం మోహన్ లాల్ ఎంతగానో కష్టపడ్డారు. ఆరు పదుల వయసు దగ్గరపడుతున్నా సినిమాలో క్యారెక్టర్ కోసం యువకుడిగా కనిపించడానికి వ్యాయామాలు యోగాలు అంటూ చాలానే కృషి చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. 

ఒడియన్ సినిమా ద్వారా విభిన్నమైన పాత్రల్లో లాల్ ఆడియెన్స్ ని తప్పకుండా ఆకట్టుకుంటారని ఇక మలయాళం తో పాటు తెలుగులో కూడా సినిమాను ఒకేసారి రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. నేడు తెలుగు పోస్టర్ ను వివి.వినాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. దగ్గుబాటి క్రియేషన్స్ బ్యానర్ పై తెలుగులో సినిమాను గ్రాండ్ డిసెంబర్ 14న గా రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు వివరణ ఇచ్చారు.