Asianet News TeluguAsianet News Telugu

అలీకి తన కష్టాలు వివరించిన మోహన్ బాబు.. లారీ క్లీనర్ ఒక అమ్మాయిని రేప్ చేస్తే..

స్టార్ కమెడియన్ అలీ ప్రస్తుతం బుల్లితెరపై కూడా రాణిస్తున్నారు. అలీతో సరదాగా అనే షోకి హోస్ట్ గా చేస్తున్నాడు. పలువురు సెలెబ్రిటీలు ఈ షోకి అతిథులుగా హాజరవుతూ తమ వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలని అలీతో షేర్ చేసుకుంటారు.

Mohan Babu reveals interesting facts about his life with Comedian Ali
Author
Hyderabad, First Published Sep 22, 2021, 4:15 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

స్టార్ కమెడియన్ అలీ ప్రస్తుతం బుల్లితెరపై కూడా రాణిస్తున్నారు. అలీతో సరదాగా అనే షోకి హోస్ట్ గా చేస్తున్నాడు. పలువురు సెలెబ్రిటీలు ఈ షోకి అతిథులుగా హాజరవుతూ తమ వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలని అలీతో షేర్ చేసుకుంటారు. త్వరలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అతిథిగా హాజరైన ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. 

ఈ షోలో మోహన్ బాబు అలీతో సరదాగా ఉంటూనే తన జీవితంలో ఎదురైన కష్టాలని వివరించారు. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని మోహన్ బాబు అన్నారు. మేం ఐదుగురం అన్నదమ్ములం. తన తల్లి వినికిడి లోపం ఉన్నప్పటికీ ఎన్నో కష్టాలు ఎదుర్కొని తమ ఐదుగురిని పెంచినట్లు మోహన్ బాబు అన్నారు. తాను చాలా రఫ్ అని అంతా భావిస్తారు.. కానీ తాను చాలా సెన్సిటివ్ అని మోహన్ బాబు అన్నారు. 

సినిమాల్లోకి వెళ్లాలనుకున్నప్పుడు హైదరాబాద్ ని నీ జీవితంలో చూడగలవా అని హేళన చేసిన వారు కూడా ఉన్నారు అని మోహన్ బాబు అన్నారు. భక్త వత్సలం నాయుడుగా ఉన్న తనని దాసరి నారాయణ రావు గారు మోహన్ బాబుగా ఎలా మార్చారో కూడా వివరించారు. 

అలాగే జూ. ఎన్టీఆర్, చిరంజీవి గురించి కూడా కామెంట్స్ చేశారు. ఇక తన తదుపరి చిత్రం సన్నాఫ్ ఇండియాలోని ఓ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు. 'లారీ క్లీనర్ ఒక అమ్మాయిని రేప్ చేస్తే 24 గంటల్లో ఎన్కౌంటర్ చేస్తారు.. మనం శభాష్ అని చప్పట్లు కొడతాం.. అదే బడా బాబులు వాళ్లకి పుట్టిన బుడ్డ బాబులు రేప్ చేస్తే 24 ఏళ్ళైనా న్యాయం జరగదు.. దట్ ఈజ్ అవర్ ఇండియా' అని మోహన్ బాబు డైలాగ్ రివీల్ చేశారు. ఇక పూర్తి ఇంటర్వ్యూ సెప్టెంబర్ 27న ప్రసారం కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios