Asianet News TeluguAsianet News Telugu

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

వివాదాస్పద మాటలతో ఎప్పుడూ.. సంచలనాలు చేస్తుంటాడు టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు. ఈసారి ఆయన ఏకంగా ఐఏఎస్.. ఐపీఎస్ లపైనే నోరు పారేసుకున్నారు. 

Mohan Babu Controversial Comments On IPS and IAs
Author
First Published Dec 20, 2022, 3:03 PM IST

టాలీవుడ్ సీనియర్ నటుడు  మోహన్ బాబు  మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.  వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. చేశారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై ఆయన చేసిన వ్యాక్యలు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.  ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారి కోసమే వీళ్ళు  పనిచేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన హీరో విశాల్ లాఠీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు మోహన్ బాబు. ఆ వేదిక మీద నుంచి మోహన్ బాబు ఈ వాఖ్యలు చేశారు. 

ముఖ్యంగా మోహన్ బాబు  పోలీసు ఉన్నతాధికారులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పోలీసులంటే గౌరవం ఉందని.. ఎప్పుడూ నిజాన్ని నిర్భయంగా చెప్తానని ఆయన స్పష్టం చేశారు.ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తుంటారని విమర్శించారు. కింది స్థాయిలో ఉన్న పోలీసు అధికారులు, పోలీసులపై పై స్థాయిలో ఉన్న ఐపీఎస్ ల ఒత్తిడి ఉంటుందని మోహన్ బాబు చెప్పారు. 'సార్ ఇది నిజం, ఇది జరిగింది, నేను కళ్లా చూశాను, మీరు తప్పు చెప్పమంటున్నారు, నేను నిజం చూశాను' అని కింది స్థాయి వాళ్లు చెపితే అతని ఉద్యోగం పోతుందని అన్నారు. 

మోహన్ బాబు అంటే కాంట్రవర్సీ..కాంట్రవర్సీ అంటే మోహన్ బాబు అన్నట్టు తయారయ్యింది ప్రస్తుత పరిస్థితి. ఆయన ముక్కుసూటి మనస్తత్వం ఉన్న వ్యాక్తి.. ఎక్కడ ఎవరు ఉన్నారు అని చూడకుండా మాట్లాడి.. చాలా సార్లు వివాదాలకు కారణం అవుతుంటాయి. తన మనసులో ఉన్న మాటను ఎలాంటి సంకోచం లేకుండా బయటకు చెప్పడం మోహన్ బాబుకు అలవాటు.. ఇక ఈక్రమంలోనే ఆయన  తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 

ఇప్పటికే మెహన్ బాబుతో పాటు మంచు ఫ్యామిలీ అంతా.. తమ మాటలతో ట్రోలర్స్ కు దొరికిపోతుంన్నారు. ఈవెంట్ లోనో.. సినిమాల్లోనో వారు చెప్పే డైలాగ్స్ వెంటనే ట్రోల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. మంచు మనోజ్ తప్పించి మోహన్ బాబు, మంచు లక్ష్మీ, విష్ణు ముగ్గురుపై ట్రోల్స్ ఓ రేంజ్ లో కనిపిస్తాయి సోషల్ మీడియాలో. ఈ మధ్య ట్రోలర్స్ పై పరువునష్టం దావా కూడా వేశారు విష్ణు. ఈక్రమంలో మోహన్ బాబు మాటలపై ఎలాంటి మీమ్స్ వస్తాయో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios