అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 'మిస్టర్ మజ్ను'. మంచి అంచనాలతో ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'తొలిప్రేమ' చిత్రంతో సక్సెస్ అందుకున్న వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.

ఈ సినిమా ట్రైలర్, టీజర్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లోజరిగింది. ఈ సినిమా ప్రీమియర్లు ఇప్పటికే పలు చోట్ల ప్రదర్శితం కావడంతో సినిమా ఎలా ఉందనే విషయాలను అభిమానులు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ తో మంచి ఫీల్ కలిగించారని అంటున్నారు. మరోసారి వెంకీ అట్లూరి తన సెన్సిబుల్ మేకింగ్ తో కథను బాగా డీల్ చేశాడని టాక్. ఎమోషనల్ సీన్స్ లో అఖిల్ కూడా బాగా చేశాడని.. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త స్లోగా నడిచిందని అంటున్నారు.

హీరోగా అఖిల్ తన డాన్స్, ఫైట్స్ తో ఆకట్టుకున్నాడని టాక్. నటన పరంగా చక్కటి పరిణితి చూపించాడని ట్వీట్లు పెడుతున్నారు. తమన్ అందించిన పాటలు, నేపధ్య సంగీతం బాగున్నాయని.. ఈ సినిమాతో అఖిల్ ఖాతాలో హిట్టు పడినట్లేనని అక్కినేని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.