Asianet News TeluguAsianet News Telugu

#Mehreen:మొహం నిండా సూదులు...బాలయ్య కోసమేనా?

 ఒక స్పెషలిస్ట్ డాక్టర్ వద్దనే మెహ్రిన్ ఈ ఆకు స్కిన్ లెఫ్ట్ ట్రీట్మెంట్ చేయించుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. 

Mehreen revealed via social media that she had an acupuncture facelift
Author
First Published Dec 1, 2022, 12:01 PM IST

 ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ ద్వారా మూవీల్లోకి ఎంట్రీ ఇచ్చిన  హీరోయిన్‌ మెహ్రీన్‌ ఆ తర్వాత వరసపెట్టి సినిమాలు చేస్తూనే ఉంది. ఎఫ్‌–2,ఎఫ్ 3 చిత్రాల ద్వారా ఆమె మరింత పాపులర్ అయ్యింది.   మహానుభావుడు, మంచిరోజులు వచ్చాయి వంటి సినిమాల్లో నటించిన మెహ్రిన్‌కి గట్టి హిట్ సినిమా పడలేదు.  బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. అందుకోసం గ్లామర్ పెంచే పనిలో పడింది. . ఈ క్రమంలో  తాజాగా తన మొహం నిండా సూదులతో మెహ్రిన్ సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేసింది.

ఆక్యుపంచర్ లో ఆక్యు స్కిన్ లఫ్ట్ అని ఒక తెరపి చేయించుకుంటున్నట్లు తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. దీనివల్ల ఫేస్ మరింత కాంతివంతంగా తయారవుతుందని చెప్తోంది.అదొక ఫేస్ ట్రీట్మెంట్..అందంగా ఉండటం కోసం చేయించుకుంటారు.  అయితే ఈ ట్రీట్మెంట్ ని  ఎక్కువగా వయస్సు పెరుగుతున్న  వారు మాత్రమే చేయించుకుంటూ ఉంటారు. కానీ 30 ఏళ్ల వయసులోని మెహ్రిన్ ఎందుకు చేయించుకుంటోంది అంటు కామెంట్స్  వినిపిస్తున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్స్ సైతం పలు రకాలుగా కామెంట్లు  చేసే అవకాసం ఉంది.

అందుకే తనపై వచ్చే  మెహ్రిన్ మెసేజ్ ను డిసేబుల్లో పెట్టేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఒక స్పెషలిస్ట్ డాక్టర్ వద్దనే మెహ్రిన్ ఈ ఆకు స్కిన్ లెఫ్ట్ ట్రీట్మెంట్ చేయించుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇలా ట్రీట్మెంట్ చేయించుకుంటూ షేర్ చేసిన ఫోటోలను ఆ ట్రీట్మెంట్కు గల కారణాలు తెలియజేస్తే బాగుంటుందని అభిమానులు తెలియజేస్తూ ఉన్నారు.  
 
మరో ప్రక్క ఎఫ్‌2, రాజా ది గ్రేట్, ఎఫ్‌3 సినిమాలతో అనీల్‌ రావిపూడి డైరెక్షన్‌లో వరుసగా మూడు సినిమా చేసిన మెహ్రిన్..అనీల్ నెక్స్ట్ చేయబోయే సినిమాలో కూడ తానే హీరోయిన్‌గా నటిస్తోందనే టాక్‌ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఇందులో నందమూరి బాలకృష్ణ పక్కన యాక్ట్ చేస్తుందని అంటున్నారు. అందుకోసమే ఈమె ఇలా ఆక్యుపంచర్ థెరిపీ ట్రై చేస్తోందని అంటున్నారు. నిజమేమిటో తెలియాల్సి ఉంది.

మెహ్రీన్ సల్మాన్‌ఖాన్‌కి పెద్ద ఫ్యాన్‌ . ఆయనతో సినిమా చేయాలన్నది ఆమె డ్రీమ్‌. తెలుగులో సమంత యాక్టింగ్‌కి ఫిదా, బాలీవుడ్‌లో కాజల్‌కి పెద్ద ఫ్యాన్‌ని అని చెప్తోంది. టాలీవుడ్‌లో అందరి హీరోలతో యాక్ట్‌ చేయాలనుంది. రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలి.. ఖచ్చితంగా చేస్తా.   నా యాక్టింగ్‌ బాగుందని విజయశాంతి కాంప్లిమెంట్‌ ఇచ్చారని మురిసిపోతోంది.   త్వరలో తెలుగులో గోపీచంద్, నాగశౌర్య, కళ్యాణ్‌రామ్‌తో కనిపిస్తా.  రెండు పంజాబీ, ఓ కన్నడ సినిమాలు కూడా ఉన్నాయి.. అంటోంది మెహ్రీన్‌.  

Follow Us:
Download App:
  • android
  • ios