Asianet News TeluguAsianet News Telugu

ఫారెన్ షెడ్యూల్ కు వాల్తేరు వీరయ్య... మెగా ఫ్యాన్స్ కు పండగే

ఫారెన్ షెడ్యూల్ కు రెడీ అవుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి, వాల్తేరు వీరయ్య ఫారెన్ స్టెప్పులకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 

Megastar Chiranjeevi Waltair Veerayya Movie Foran Schedule
Author
First Published Nov 27, 2022, 1:32 PM IST

ఫారెన్ షెడ్యూల్ కు రెడీ అవుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి, వాల్తేరు వీరయ్య ఫారెన్ స్టెప్పులకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 

యామా ఊపు మీద ఉన్నాడు మెగా స్టార్ చిరంజీవి. ఏజ్ పెరుగుతున్నా కొద్ది  స్పీడ్ కూడా పెంచుకుంటూ పోతున్నాడు. రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమాతో ఫ్యాన్స్ కు దిల్ ఖుష్ అయ్యేలా ట్రీట్ ఇచ్చాడు చిరంజీవి. అదే జోష్ తో నెక్ట్స్ సినిమాలపై కూడా కాన్సంల్టేట్  చేశాడు. గాడ్ ఫాదర్ తరువాత  మెగా ఫ్యాన్స్ అంతా  ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈసినిమాపై  భారీ అంచనాలు ఉన్నాయి. అందులోను  అందరివాడు తరువాత ఆరేంజ్ ఫుల్ మాస్ మసాలా మూవీ ఇది కావడంతో బజ్ బాగా పెరుగుతుంది. 

క్యూట్ గా కాస్త హీరో లుక్ లో ఉండే బాబీ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో.. ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరిగిపోయింది జనాలకు. ఇక ఈమూవీలో మాస్ మహారాజ్ రవితేజ్ కూడా నటిస్తుండటంతో.. మాస్ మాస్ కాస్తా.. ఊరమాస్ సినిమా అవుతుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.  ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి నుంచి బాస్ సాంగ్ ఊర్రూతలూగిస్తుంది. ఫస్ట్  సింగిల్ ను రిలీజ్ చేసిన వెంటనే భారీ వ్యూవర్ షిప్ వచ్చింది. ఇక  ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మిలియన్స్ వ్యూస్ రాబడుతోంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ పాట మెగాస్టార్ కోసం స్పెషల్ గా కంపోజ్ చేయడమే కాకుండా  స్వయంగా లిరిక్స్ కూడా రాశారు.

సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్నా .. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ షెడ్యూల్ కంప్లీట్  తాజాగా ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో పూర్తయ్యిందని తెలుస్తోంది. ఇక నెక్ట్స్  పార్ట్‌ షూట్ ను ఫారెన్ షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ కోసం టీమ్ అంతా ఫ్రాన్స్ కు వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.  

డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ లో చిరంజీవితో స‌హా యూనిట్ స‌భ్యులు అంతా ఫ్రాన్స్ ప‌యనం అవుతున్నార‌ట‌. అక్కడి షెడ్యూల్ ను ఒక వారంలోనే మొత్తం షూటింగ్‌ను పూర్తి చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారట. అంతే కాదు సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్యను రిలీజ్ చేయనున్నాట్టు తెలుస్తోంది. ఇక ఈమూవీ తో పాటు వారసుడు లాంటి మరికొన్ని సినిమాలు పోటీకి రాబోతున్నాయి. 

ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ డైరెక్షన్ లో సినిమా స్టార్ చేయబోతున్నాడు. భోళాశంకర్  టైటిల్ తో రాబోతున్న ఈమూవీ ఇప్పటికే ఆడియన్స లో బాగా పాపులర్ అయ్యింది.  ఈ సినిమాలో కీర్తిసురేష్ చిరు చెల్లెలిగా కనిపించనున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios