Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్ 'విశ్వంభర' చిత్రానికి ఊహించని సమస్య.. అంతమందిని ఎలా తీసుకొస్తారో

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజువల్ వండర్ గా రూపొందుతోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత మెగాస్టార్ ఆ తరహా ఫాంటసీ జోనర్ లో నటిస్తున్న చిత్రం ఇదే. 

Megastar Chiranjeevi vishwambhara movie needs young heroes and heroines dtr
Author
First Published Mar 3, 2024, 5:20 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజువల్ వండర్ గా రూపొందుతోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత మెగాస్టార్ ఆ తరహా ఫాంటసీ జోనర్ లో నటిస్తున్న చిత్రం ఇదే. ముల్లోకాలు చుట్టూ ఈ కథ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ చిత్రంలో వీరుడిగా నటించే చిరంజీవి ఏ లక్ష్యం కోసం పోరాడబోతున్నాడు, ఈ చిత్ర కథలోని కీలక అంశం ఏంటి అనేది ఇప్పటికీ సస్పెన్స్. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా ఎంపికైంది. ఇప్పటికే విశ్వంభర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సురభి, ఇషా చావ్లా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో విజువల్స్, యాక్షన్ సీన్స్ ఎంత గ్రాండ్ గా ఉంటాయో సెంటిమెంటల్ సీన్స్ కూడా అదే స్థాయిలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెళ్ళ పాత్రలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారట. ఇప్పటికే సురభి, ఇషాచావ్లా లాంటి వాళ్ళని ఎంపిక చేశారు. మరికొంతమంది హీరోయిన్లని ఎంపికచేయాల్సి ఉంది. 

ఇది కాక వాళ్లందరికీ జోడీలుగా యువ హీరోలని కూడా తీసుకోబోతున్నట్లు టాక్. సుశాంత్, రాజ్ తరుణ్ లాంటి హీరోల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ రేంజ్ కాస్టింగ్ అంటే బడ్జెట్ తడిసి మోపెడు అవుతుంది. మరి అంతమంది హీరోలని, హీరోయిన్లని ఈ చిత్రంలోకి ఎలా తీసుకువస్తారు ? ఎలా కథలో ఇన్వాల్వ్ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. 

కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత భోళా శంకర్ లాంటి డిజాస్టర్ ఎదురైంది. దీనిని మెగా అభిమానులు మరచిపోవాలంటే విశ్వంభర చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. 2025 సంక్రాంతికి విశ్వంభర రిలీజ్ కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios