Asianet News TeluguAsianet News Telugu

వరుణ్ సినిమాల్లో నాకు నచ్చిన మూవీ అదే.. ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు కామెంట్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. దీనితో ఈ మూవీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

megastar chiranjeevi speech at varun tej operation valentine pre release event dtr
Author
First Published Feb 25, 2024, 11:00 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. దీనితో ఈ మూవీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న రిలీజ్ కి రెడీ అవుతోంది. 

రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మవిభూషణ్ అవార్డు అందిన తర్వాత చిరంజీవి హాజరువుతున్న తొలి ప్రీ రిలీజ్ ఈవెంట్ కావడంతో అయన ఏవీ అద్భుతంగా డిజైన్ చేసారు. ఏవి పూర్తి కాగానే ఆడిటోరియం మొత్తం చిరంజీవి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. 

ఇక చిరంజీవి ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎంతో అద్భుతంగా ప్రసంగించారు. నేను యుఎస్ లో ఉండగా వరుణ్ నాకు మెసేజ్ పెట్టాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇలా తన చిత్రం గురించి చెప్పాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మీరు వచ్చి నాలుగు మాటలు చెబితే రీచ్ బావుంటుందని అన్నాడు. మనకోసం కంటిమీద నిద్ర లేకుండా బోర్డర్ లో కష్టపడుతున్న జవాన్ల గురించి మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టం.. నేను తప్పకుండా వస్తా అని చెప్పా. 

టైటిల్ లో వాలెంటైన్ అని ఉంది.. రొమాన్స్ కూడా ఉందా అని అడిగా..లేదు ఆరోజున జరిగే ఆపరేషన్ కాబట్టి అలా టైటిల్ పెట్టినట్లు తెలిపాడు. ఇక చిరు దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ గురించి మాట్లాడుతూ.. ఈ డైరెక్టర్ గురించి నేను తెలుసుకుని ఆశ్చర్యపోయా. గతంలోనే సొంతంగా 5 లక్షల ఖర్చుతో ఆర్మీపై షార్ట్ ఫిలిం చేశాడు. షార్ట్ ఫిలిం లో ఉన్న విషయాలని ఆర్మీ వాళ్ళు సైతం ఆశ్చర్యపోయారట. ఎందుకంటే ఎవరికీ తెలియని సీక్రెట్స్ మొత్తం శక్తి ప్రతాప్ సింగ్ తీసుకుని ఆ షార్ట్ ఫిలిం చేశాడు. 

ఇక ఈ చిత్రం కోసం ఎంతో మంది ఇండియా ఎయిర్ ఫోర్స్ అధికారులని కలసి చాలా అధికారిక సమాచారం సంపాదించాడు. నేటి తరం యువత ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది అని చిరంజీవి అన్నారు. శక్తి ప్రతాప్ సింగ్ ఎక్కడో రాజస్థాన్ నుంచి వచ్చి టాలీవుడ్ మొత్తానికి ఒక మెసేజ్ ఇస్తున్నాడు. చాలా తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన క్వాలిటీతో సినిమా చేయొచ్చని ఆపరేషన్ వాలంటైన్ చిత్రంతో నిరూపించాడు అని చిరంజీవి ప్రశంసలు కురిపించారు. 

అనంతరం చిరంజీవి వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ కి మా కుటుంబంలో ఎవరికీ దక్కని అవకాశాలు దక్కుతున్నాయి. కంచె చిత్రంలో సైనికుడిగా, అంతరిక్షంలో వ్యోమగామిగా, తొలిప్రేమలో లవర్ బాయ్ గా ఇలా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వెళుతున్నాడు. వరుణ్ సినిమాల్లో గద్దలకొండ గణేష్ చిత్రం అంటే నాకు చాలా ఇష్టం అని చిరంజీవి తన మనసులో మాట బయట పెట్టారు. ఏఈ చిత్రం తప్పకుండా అద్భుతమైన విజయం సాధిస్తుందని చిరంజీవి ఆకాంక్షించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios