చిరంజీవి.. `భోళా శంకర్‌` చిత్రంతో రాబోతున్నారు.  తాజాగా హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతుంది. తాజాగా చిరంజీవి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చారు.

చిరంజీవి.. `భోళా శంకర్‌` చిత్రంతో రాబోతున్నారు. మరో ఐదు రోజుల్లో సినిమా రిలీజ్‌ కానుంది. తాజాగా హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతుంది. తాజాగా చిరంజీవి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చారు. మెగా మాస్‌ ఎంట్రీ తరహాలో ఆయన ఈవెంట్‌ ప్రాంగణంలోకి రావడం విశేషం. ఆయన ఎంట్రీతో శిల్పకళా వేదిక ఒక్కసారిగా హోరెత్తిపోయింది. అభిమానుల అరుపులతో దద్దరిల్లిపోయింది. దీంతో తన అభిమానులకు అభివాదం తెలిపారు చిరు. 

ఈవెంట్‌కి బ్లాక్‌ అండ్‌ బ్లూ కాంబినేషన్‌లో డ్రెస్‌ ధరించి చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు చిరంజీవి. మరో ఇరవై ఏళ్లు వెనక్కివెళ్లారనేలా ఆయన లుక్‌ ఉండటం విశేషం. ఇక చిరంజీవి ఎంట్రీకి యాంకర్‌ సుమ ఎలివేషన్‌ నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు. ఆమె ఎంట్రీతోనే చిరుని ఆకాశానికి ఎత్తేసింది. ఇక ఆయన రాకతో మరోసారి హో అనిపించేలా చేసింది. ఆద్యంతం సందడిగా `భోళాశంకర్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతుంది. వేలాడి మంది అభిమానులు తరలి వచ్చారు. దీంతో వేదిక ప్రాంతం అంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది. 

ఇక ఈ వేడుకకి చిత్ర దర్శకుడు మెహర్‌ రమేష్‌తోపాటు దర్శకుడు బాబీ, యాంకర్‌ శ్రీముఖి, హైపర్‌ ఆది, గెటప్‌ శ్రీను, లోబో, అని మాస్టర్, రామ్‌ లక్ష్మణ్‌ మాస్టర్స్, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్‌, చిత్ర నిర్మాత అనిల్‌ సుంకర, సురేఖ వాణి, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. 

ఇక మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటించగా, కీర్తిసురేష్‌ ఆయనకు చెల్లిగా చేసింది. శ్రీముఖి కీలక పాత్రలో కనిపించబోతుంది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మించారు. ఈ నెల 11న స్వాతంత్ర్య దినోత్సవంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. `వాల్తేర్‌ వీరయ్య` వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత చిరంజీవి నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలు ఆ అంచనాలను మరింత పెంచాయి.