చంద్రబోస్ కు చిరంజీవి ఘన సన్మానం.. ఆస్కార్ వేదికపై మొదటి తెలుగు పదం వినిపించావ్.. అంటూ ప్రశంసలు
‘నాటు నాటు’ పాటకు లిరిక్స్ అందించి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును దక్కించుకున్న ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ ను మెగాస్టార్ చిరంజీవి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రశంసల వర్షం కురిపించారు.
భారతీయులు కలగా భావించిన ప్రతిష్టాత్మకమైన Oscar Award ‘ఆర్ఆర్ఆర్’తో సాకారమైంది. సెన్సేషనల్ సాంగ్ ‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డు దక్కడంతో 130 కోట్ల మంది భారతీయులు గర్వించారు. అమెరికాలోని లాస్ ఎంజిల్స్ లో గల డాల్బీ థియేటర్లో మార్చి 13న 95వ ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వేదికపై ‘నాటు నాటు’ సాంగ్ లైవ్ మ్యూజిక్ పెర్ఫామెన్స్ ఇవ్వడంతో పాటు.. అవార్డును కూడా దక్కించుకోవడంతో ఇండియా సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది.
ఇక ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ అవార్డును వేదికపై స్వీకరించారు. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన వీరిని ప్రముఖులు అభినందిస్తూ సన్మానాలు చేస్తూనే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆస్కార్ దక్కడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ పై ప్రశంసలు కురిపించారు. రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్ డే బష్ లో ఎస్ఎస్ రాజమౌళి, రమ, ఎంఎం కీరవాణి, ఆయన భార్య, ఆర్ఆర్ఆర్ టీమ్ సభ్యులను సన్మానించారు. ఇక తాజాగా లిరిసిస్ట్ చంద్రబోస్ ను ఘనంగా సన్మానించారు.
అయితే తాజాగా మెగాస్టార్ Chiranjeevi, దర్శకుడు మెహర్ రమేశ్ అండ్ భోళా శంకర్ టీమ్ తో కలిసి చంద్రబోస్ (Chandra Bose)ను ఘనంగా సన్మానించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న చంద్రబోస్ ప్రత్యేకంగా శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను ట్వీట్ వేదికన పంచుకుంటూ చంద్రబోస్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
ట్వీట్ లో.. 95వ ఆస్కార్ వేదికపై తొలి తెలుగు పదాలను చంద్రబోస్ వినిపించడం ఎంతో అద్భుతమైన అనుభూతి. అందుకు మీకు ధన్యవాదాలు. మీ ద్వారా ఆ క్షణాలను పొందడం చాలా ఆనందంగా ఉంది. ఆస్కార్స్95 వేడుకలను విజయవంతంగా పూర్తి చేసుకున్న మీకు హృదయపూర్వకంగా అభినందలు తెలియజేస్తున్నాను‘ అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను కూడా పంచుకున్నారు. ఇక చంద్రబోస్ కు తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్ర భారతీలో చంద్రబోస్ ను ఘనంగా సన్మానించారు.
‘నాటు నాటు’ పాటకు లిరిక్స్ అందించి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును దక్కించుకున్న ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ ను మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు. మరోవైపు భోళా శంకర్ టీమ్ నుంచి దర్శకుడు మెహర్ రమేశ్, తదితరులు చంద్రబోస్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆస్కార్ వేదికపై చంద్రబోస్ ‘నమస్తే’ అని వ్యాఖ్యానించడం విశేషంగా మారింది.