'సైరా నరసింహారెడ్డి' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర చనిపోతుందనే విషయాన్ని మొదటి నుండి ప్రేక్షకులకు చెబుతూ వారిని మానసికంగా సిద్ధం చేస్తోంది చిత్రబృందం. ఇప్పటికే దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు చిరంజీవి కూడా అదే పని చేస్తున్నారు. తన పాత్ర చనిపోతుందని, ప్రేక్షకులు షాక్ అవ్వాల్సిన 
అవసరం లేదని అంటున్నారు.

ఇది చరిత్ర కాబట్టి, ప్రేక్షకులు కూడా మెంటల్ గా ప్రిపేర్ అయి వస్తారు కాబట్టి వాళ్లకి షాకింగ్ గా అనిపించదని చిరు అన్నారు. నరసింహారెడ్డిలో పాత్రను మాత్రమే చూస్తారని.. తనను చూడరని అంటున్నారు మెగాస్టార్. నరసింహారెడ్డి పాత్ర చనిపోతుందని చాలా రోజులుగా చెబుతూ వస్తున్నామని.. కాబట్టి ప్రేక్షకులు నిరాశపడరనే అనుకుంటున్నామని అన్నారు.

సినిమా క్లైమాక్స్ పూర్తైన తరువాత గొప్ప ఫీలింగ్ తో ప్రేక్షకుడు బయటకొస్తాడనే నమ్మకం తనకుందని చిరు అన్నారు. బ్రిటీష్ వాళ్లు నరసింహారెడ్డి తలను కోటగుమ్మానికి ముప్పై ఏళ్లపాటు వేలాడి ఉంచారని.. ప్రజల్లో భయం పుట్టించడానికే వారు ఆ పని చేశారని చెప్పిన చిరంజీవి ఆ సన్నివేశాలు మాత్రం 'సైరా'లో ఉండవని చెప్పారు. క్లైమాక్స్ లో వచ్చే పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో సినిమా ముగుస్తుందని.. అదంతా ఎంతో ఎమోషనల్ గా ఉంటుందని చెబుతున్నారు. 

రామ్ చరణ్ నిర్మాతగా మారి, 'సైరా' సినిమాను తనకు, ప్రేక్షకులకు గిఫ్ట్ గా అందించాడని, ఓ తండ్రిగా తను చరణ్ కి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలనే విషయంగురించి ఇంకా ఆలోచించలేదని చెప్పిన చిరు 'సైరా' రిలీజ్ తరువాత తప్పకుండా చరణ్ కి గిఫ్ట్ ఇస్తానని చెప్పారు.