Asianet News TeluguAsianet News Telugu

రామ్ చరణ్ చేశాడుగా చాలు, రాజమౌళితో సినిమా నావల్ల కాదు అన్న మెగాస్టార్ చిరంజీవి

టాలీవుడ్ జక్కన్న.. యూనివర్సల్ డైరెక్టర్ రాజమౌళితో సినిమా విషయంలో మరో సారి క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. జక్కన్నతో సినిమానా.. అమ్మో నావల్ల కాదు అంటూ.. గతంలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాన్నన్నారు. దానికి కారణం ఏంటీ అని అడగ్గా.. ఇలా చెప్పారు చిరు. 

Megastar Chiranjeevi clarity about Movie with Rajamouli
Author
First Published Oct 1, 2022, 8:15 AM IST

రాజమౌళితో సినిమా విషయంలో మరో సారి క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. జక్కన్నతో సినిమానా.. అమ్మో నావల్ల కాదు అంటూ.. గతంలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాన్నన్నారు. దానికి కారణం ఏంటీ అని అడగ్గా.. ఇలా చెప్పారు చిరు. 

బాహుబలి సినిమాతో తెలుుగ సినిమా స్థాయితో పాటు.. ఇండియన్ సినిమా స్థాయిని కూడా పెంచిన దర్శకధీరుడు రాజమౌళి. మరి ఈ దర్శకుడితో సినిమా చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. చిన్ చిన్న ఆర్టిస్ట్ ల దగ్గర నుంచి.. స్టార్ హీరోల వరకూ జక్కన్న సినిమాలో నటించాలని ఉవ్విళ్ళూరుతుంటారు. కాని రాజమౌళితో సినిమా చేయబోతున్నారా అని మెగాస్టార్ చిరంజీవిని అడగ్గా.. తనకు ఆ కోరిక లేదు అని అందరిని ఆశ్చర్య పరిచారు. గతంలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్న చిరంజీవి.. దానికి కారణం కూడా వివరించారు. 


ప్రస్తుతం మెగాస్టార్ గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా ఈవెంట్లు..ఇంటర్వ్యూలతోఅదరగొడుతున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా.. ఓ ఇంటర్వ్యూలో  దర్శకుధీరుడు రాజమౌళి  గురించి ఆసక్తి వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. రాజమౌళి గొప్ప డైరెక్టర్ అని.. ఆయన అంటే తనకు ఇష్టమని చెప్పారు. అయినా ఆయన డైరెక్షన్‌లో యాక్ట్ చేయాలనే కోరిక మాత్రం లేదన్నారు చిరంజీవి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి రాజమౌళి అని అన్నారు మెగాస్టార్. తెలుగు సీనీ పరిశ్రమను అమాంతం పైకి లేపిన దర్శకధీరుడు జక్కన్న అంటే తనకెంతో అభిమానం అన్నారు చిరు. 

ఇక ఆయనతో సినిమా చేసే విషయానికి వస్తే..  రాజమౌళి ప్రతి విషయాన్ని చాలా డిప్‌గా చూస్తారని.. ఆయన కోరుకున్న ఔట్‌పుట్‌ను ఇవ్వగలనో లేదో  అని అనుమానం వ్యక్తం చేశారు మెగాస్టార్. అంతే కాదు రాజమౌళి సినిమా అంటే రెండు మూడేళ్లు  చేయాల్సి వస్తుందని.. ఈ టైమ్ లో తాను నాలుగైదు సినిమాలు చేసుకుంటానని  క్లారిటీ ఇచ్చారు చిరు. తన తనయుడ రామ్ చరణ్ జక్కన్నతో రెండు సిసిమాలు చేశాడు కదా.. ఆ సంతోషం తనకు చాలన్నారు. ఇక ముందు కూడా వారి కాంబోలో సినిమాలు వస్తాయన్న నమ్మకం ఉందన్నారు మెగాస్టార్ . అందుకే రాజమౌళితో వర్క్ చేయాలని గానీ.. పాన్ ఇండియా యాక్టర్‌గా గుర్తింపు పొందాలని గానీ లేదంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. 

మెగా అభిమానులు కళ్ళు కాయలు కాసేలా  ఎదురుచూస్తున్న గాడ్ ఫాదర్  మూవీ ఈనెల 5న  దసరా సందర్భంగా రిలీజ్ అవ్వబోతోంది. రీసెంట్ గా జరిగిన  గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగా అభిమానుల కోసం మెగా ట్రైలర్‌ తో మెగాీ ట్రీట్ ఇచ్చారు మేకర్స్.  ఈ ట్రైలర్ గాడ్ ఫాదర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. మెగాస్టార్ చిరంజీవి  పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టడంతో బిగ్ స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.  తెలుగుతో పాటు హిందీలోనూ గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్ కాబోతుంది.  సల్మాన్ ఖాన్ ఈ మూవీలో నటించడంతో హిందీలోను ఈసినిమాపై ఆసక్తి పెరిగింది. ఇక ఈమూవీ ప్రమోషన్స్ లో మెగాస్టార్ ఫుల్ బిజీగా ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios