Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్ కు 10th లో ఎన్ని మార్కులోచ్చాయో తెలుసా..? వైరల్ అవుతున్న చిరంజీవి SSC సర్టిఫికెట్..

మెగాస్టార్ చిరంజీవికి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా..? ఆయన SSC సర్టిఫికెట్ ను ఎప్పుడైనా చూశారా..?  ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ఇదే..? 
 

Megastar Chiranjeevi 10th Certificate Viral In Social media JMS
Author
First Published Mar 19, 2024, 10:54 AM IST

మెగాస్టార్ చిరంజీవిగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాల్లోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. మెగాస్టార్ గా ఎదిగారు. టాలీవుడ్ లో మెగా సాంమ్రాజ్యాన్ని సృస్టించారు. బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీని మించి.. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ.. ఇండస్ట్రీలో ఎదిగారు. నలుగురు స్టార్ హీరోలు.. హీరోలు.. సినిమా నిర్మాణంతో పాటు.. ఇండస్ట్రీకి పెద్దగా చిరంజీవి రోల్ అందరికి తెలిసిందే.  స‌పోర్ట్ లేకుండా సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చి, టాప్ హీరో స్థాయికి ఎద‌గ‌డం అంటే మాములు విష‌యం కాదు. ఇలా కేవ‌లం త‌న‌ స్వ‌యంకృషితో టాలీవుడ్ స్టార్ హీరో అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. 

నటన, డాన్స్ తో .. టాలీవుడ్ లో కోట్లాది మంది అభిమానులను  చిరు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు  సినిమా ఇండ‌స్ట్రీలో స్టార్లు గా ఎదిగిన ఎంతో మంది.. టాలీవుడ్ కు మెగాస్టార్ ను  రోల్ మోడ‌ల్ గా తీసుకుని వచ్చినవారే. ఇక నటనతో పాటు సోషల్ సర్వీస్ లోకూడా చిరు ముందుంటారు. కుడిచేతితో చేసే సాయం ఎడమచేయికి తెలియకుండా చూసుకుంటారు మెగాస్టార్. రీసెంట్ గా  ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు కూడా అందుకున్నారు. 70 ఏళ్ల‌కు ద‌గ్గ‌ర ప‌డుతున్నా.. ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌తో పోటీప‌డి చిరంజీవి సినిమాలు చేస్తున్నారు. 

ఇక తాజాగా మెగాస్టార్ కు సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతోంది. అందేంటో కాదు. మెగాస్టార్ 10వ త‌ర‌గ‌తి స‌ర్టిఫికేట్. అవును ఆయన 10th సర్టిఫికెట్  తాలూకు ఫొటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ స‌ర్టిఫికేట్‌లో చిరంజీవి పేరు కేఎస్ఎస్ వ‌ర‌ప్ర‌సాద్ రావు అని, తండ్రి పేరు వెంక‌ట్ రావు అని ఉంది.  చిరు పెనుగొండ‌లో పుట్టిన‌ట్లు అందులో ఉంది. అయితే ఇందులో మెగాస్టార్ కు ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది మాత్రం కనిపించడం లేదు.  ఇప్పుడీ స‌ర్టిఫికేట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని సూసి మెగా అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.  త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. 

ఇక చిరు ప్ర‌స్తుతం టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ వ‌శిష్ఠ ద‌ర్వ‌క‌త్వంలో విశ్వంభ‌ర అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో చిరంజీవి స‌ర‌స‌న‌ సీనియ‌ర్ న‌టి త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న విడుద‌ల చేస్తామ‌ని ఇప్ప‌టికే మూవీ యూనిట్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios