టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ సైరా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక సైరా చిత్రాన్ని ప్రత్యేకంగా ముంబైలో మీడియా కోసం ప్రదర్శిస్తున్నారు. ఆ షో ఫస్ట్ హాఫ్ కూడా పూర్తయ్యింది. ఈ రాత్రి 11 గంటలలోపు హిందీ ఫిలిం క్రిటిక్స్ నుంచి సైరా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేస్తుందన్నమాట.

ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ అద్భుతంగా నటించినట్లు టాక్ వస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ యుద్ధ సన్నివేశాల్లో నటించిన విధానానికి విజిల్స్ నాన్ స్టాప్ గా పడతాయని ఊహించవచ్చు. 

ఇక బీజీఎమ్ సినిమా స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా ప్రతి సీన్ లో తన పనితనాన్నీ చూపించినట్లు తెలుస్తోంది. మరో హైలెట్ ఏమిటంటే సురేందర్ రెడ్డి స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉందని నెగిటివ్ కామెంట్స్ కి తావివ్వకుండా మేకింగ్ లో తన మార్క్ ని చూపించినట్లు టాక్. ఫైనల్ గా సినిమా రిజల్ట్ ఏమిటనేది మరికొన్ని గంటల్లో తెలుస్తుంది.