Asianet News TeluguAsianet News Telugu

పీజ్జా తయారీలో వరుణ్ తేజ్ బిజీ, లావణ్య త్రిపాఠి ఎక్కడా అని అడుగుతున్న నెటిజన్లు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చెఫ్ గా మారిపోయాడు. కుక్ అవతారం ఎత్తి.. రకరకాల వంటలు వండేస్తున్నాడు.లావణ్య త్రిపాఠితో పెళ్లి వార్తల నేపథ్యంలో వరుణ్ తేజ్ వైరల్ న్యూస్ అవుతున్నాడు. 

Mega Prince Varun Tej Making Pizza JMS
Author
First Published Jun 3, 2023, 1:38 PM IST


గత కొంత కాలంగా వస్తున్న వార్తలు నిజం అయ్యేట్టుగా ఉన్నాయి. టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. ప్రేమలో ఉన్నట్టు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు న్యూస్ వైరల్ అవుతున్న క్రమంలో.. ఈ నెల 9న వీరి ఎంగేజ్ మెంట్ ఉంటుందని టాక్ టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. ఈక్రమంలోనే వీరిద్దరు  ప్రస్తుతం  వెకేషన్‌లో భాగంగా పారిస్‌లో చక్కర్లు కొడుతున్నట్టు తెలుస్తోంది. . ఇప్పటికే కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తున్నాయి. 

తాజాగా చెఫ్ అవతారం ఎత్తాడు కొన్ని స్పెషల్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. వరుణ్‌ తేజ్ తన వంట ప్రావీణ్యాన్ని బయట పెట్టాడు. చెఫ్ లు వాడే ఆఫ్రాన్ ,,క్యాప్ పెటుట్టుకుని రకరకాల వంటలు చేశాడు. పీజా, పాస్తాతో పాటు.. ట్రెడిషినల్ ఫుడ్ అయిన గవ్వలు కూడా చేశాడు వరుణ్. ఇక వాటిని నెటిజన్లకు చూపిస్తూ.. తనలో ఈ టాలెంట్ కూడా ఉందని చెప్పకనే చెప్పాడు వరుణ్. అంతే కాదు తాను బెస్ట్ చెఫ్ అంటూ.. తనకు తానే కితాబిచ్చుకున్నాడు వరుణ్ తేజ్ . 

 

వరుణ్‌ తేజ్ వంటలు చేయడం.. అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. చాలా మంది కామెంట్ చేస్తూ.. వరుణ్ ను ఆటపట్టించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో పెళ్ళి కదా..నీకు వంటలో ట్రైనింగ్  స్టార్ట్ అయ్యిందంటూ కొందరు.  మీరు ఎంగేజ్‌మెంట్ కోసం రుచికరమైన వంటకాలను తయారు చేస్తున్నారా? అని మరొకరు కామెంట్‌ పెట్టారు.  ఇంతకీ పెళ్లికూతురు లావణ్య త్రిపాఠి ఎక్కడా అంట క్వశ్చన్ చేస్తున్నారు. 

ఇక వరుణ్‌తేజ్‌  సినిమాల విషయానికి వస్తే.. ఆయన గాండివధారి అర్జున  సినిమా నటిస్తున్నాడు.  ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌ జోనర్‌లో వస్తున్న ఈ మూవీకి మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. ఈ మూవీలో ఏజెంట్ ఫేం సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా.. విమలారామన్‌, నాజర్‌, వినయ్‌ రాయ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లాస్ట్ టైమ్ ఎంతో కష్టపడి చేసిన గనిసినిమా ధారుణంగా పరాజయం చెందింది. ఇక ఈసినిమాతో సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు వరుణ్. 


 

Follow Us:
Download App:
  • android
  • ios