Asianet News TeluguAsianet News Telugu

కమల్ హాసన్ ‘విక్రమ్’ తెలుగు ట్రైలర్ లాంచ్ చేయనున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఎప్పుడంటే?

యూనివర్సల్‌ నటుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్  `విక్రమ్‌`. యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్ర తెలుగు వెర్షన్ ట్రైలర్ ను ఈ రోజు రామ్ చరణ్ లాంచ్ చేయనున్నారు.  
 

Mega power star Ram Charan to launch Kamal Haasan Vikram Movie Telugu trailer, When?
Author
Hyderabad, First Published May 20, 2022, 4:28 PM IST

యూనివర్సల్‌ నటుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్  `విక్రమ్‌`. యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తనసొంత బ్యానర్‌ అయిన రాజ్‌కమల్‌ ఫిల్మ్స్ పతాకంపై కమల్‌ హాసన్‌ ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. జూన్‌ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, తమిళ వెర్షన్ లో విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ హైప్స్ ను పెంచుతున్నాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ రా ఏజెంట్ గా కనిపించనున్నట్టు అర్థమవుతోంది. అయితే తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు రిలీజ్  చేయనున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) లాంచ్ చేయనుడటం విశేషం. చరణ్ విక్రమ్ తెలుగు వెర్షన్ ట్రైలర్ ను విడుదల చేస్తుండటం పట్ల మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు. 

ఈ చిత్రం ట్రైలర్‌ (Vikram Trailer)ను తమిళంలో ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. చిత్ర ఆడియోతోపాటు ట్రైలర్‌ని విడుదల చేయగా, సోషల్‌ మీడియాలో, యూట్యూబ్‌లో ట్రైలర్‌ ట్రెండ్‌ అవుతుంది. ఆద్యంతం యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ ట్రైలర్‌ అభిమానులకు గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. అదేవిధంగా ఫ్రాన్స్ లోని  75వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లోనూ ఈనెల 18న ఈ చిత్ర ట్రైలర్ ను ప్రదర్శించడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.  

 

Follow Us:
Download App:
  • android
  • ios