Asianet News TeluguAsianet News Telugu

మరో మెగా హీరో 'వైష్ణవ్‌ తేజ్‌' సినిమా ప్రీలుక్‌ ఇదిగో!

మెగా కుటుంబం నుంచి హీరో సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్ వెండితెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని  ఈ రోజు (సోమవారం) ఉదయం రామానాయుడు స్టూడియోలో  ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నారు. 

Mega Hero Vaishnav Teja new movie pre look
Author
Hyderabad, First Published Jan 21, 2019, 7:53 AM IST

మెగా కుటుంబం నుంచి హీరో సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్ వెండితెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని  ఈ రోజు (సోమవారం) ఉదయం రామానాయుడు స్టూడియోలో  ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీలుక్‌ను ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. ‘పంజా వైష్ణవ్’ అంటూ ఆయన‌ గెటప్‌ను తెలిపింది. ఇందులో  వైష్ణవ్  మత్య్సకారుడి గెటప్‌లో సముద్రం ఒడ్డున కనిపించారు.

మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వాస్తవిక ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ ప్రారంభోత్స‌వానికి మెగాస్టార్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నాగబాబు ఇలా మెగా హీరోలందరూ రానున్నారు.

ఇక ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించనున్నారు. బుచ్చిబాబు సానా ఇంతకు ముందు సుకుమార్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఇటీవల ‘రంగస్థలం’ చిత్రానికి రైట‌ర్‌గా కూడా పనిచేశారు.

ఇక ఈ చిత్రానికి  ఇండస్ట్రీలోని టాప్ టెక్నీషియన్స్  పని చేస్తుండటం విశేషం. ‘రాక్ స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు. అలాగే ‘రంగస్థలం’ ఫేమ్ రామకృష్ణ మౌనిక ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను చూసుకుంటుండగా… నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తున్నారు.   ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు లాంచ్ రోజునే ప్రకటించనున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios