Asianet News TeluguAsianet News Telugu

మెగా హీరో పేమెంట్.. ఇచ్చింది తీసుకోవడమే!

టాలీవుడ్ లో వరుసగా సక్సెస్ లు అందితే ఆఫర్స్ కూడా నాన్ స్టాప్ గా తలుపు తడుతుంటాయి. అదే డిజాస్టర్స్ అందితే మార్కెట్ పై ఎఫెక్ట్ పడుతుంది. తెరకెక్కిన సినిమాలు కూడా విడుదల చేయడానికి కష్టంగా మారుతుంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కూడా అలాంటి పరిస్థితులకు దగ్గరగా ఉన్నాడు. 

mega hero remuneration news viral
Author
Hyderabad, First Published Jan 19, 2019, 10:08 AM IST

టాలీవుడ్ లో వరుసగా సక్సెస్ లు అందితే ఆఫర్స్ కూడా నాన్ స్టాప్ గా తలుపు తడుతుంటాయి. అదే డిజాస్టర్స్ అందితే మార్కెట్ పై ఎఫెక్ట్ పడుతుంది. తెరకెక్కిన సినిమాలు కూడా విడుదల చేయడానికి కష్టంగా మారుతుంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కూడా అలాంటి పరిస్థితులకు దగ్గరగా ఉన్నాడు. 

గత కొంత కాలంగా ఈ మెగా మేనల్లుడు చేస్తోన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందు డిజ్జాస్టర్స్ గా నిలుస్తున్నాయి. మొన్నటివరకు అవకాశాలు బాగానే వచ్చాయి. రెమ్యునరేషన్ కూడా 3 కోట్ల పైనే అందుకున్నట్లు టాక్. కానీ సక్సెస్ రేట్ లేకపోవడంతో సాయి ధరమ్ తేజ్ పేమెంట్ కూడా తగ్గిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల వచ్చిన రెండు ఆఫర్స్ కి సాయి చాలా వరకు రెమ్యునరేషన్ ని తక్కువగానే తీసుకున్నాడట. 

సినిమాల ఫెయిల్యూర్స్ వల్ల ఈ మెగా హీరోపై ఇన్వెస్ట్ చేయడం రిస్క్ తో కూడుకున్న పని అలాంటిది కథ చెప్పడానికి ముందే రెమ్యునరేషన్ విషయాల గురించి మాట్లాడుకొని ఒక రేట్ ఫిక్స్ చేస్తున్నారట. దీంతో సాయి కూడా రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా ముందు హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ హీరో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చిత్రలహరి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios