Asianet News TeluguAsianet News Telugu

కొణిదెల ప్రొడక్షన్స్ పై విరుచుకుపడుతున్న ఫ్యాన్స్.. తీవ్ర అసహనం..

మలయాళీ బ్లాక్ బస్టర్ లూసిఫెర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కుతోంది. విజయదశమి కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Mega Fans trolling on Konidela productions
Author
First Published Sep 19, 2022, 2:30 PM IST

ఆచార్య రిజల్ట్ తో తీవ్ర నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం ఆశలన్నీ 'గాడ్ ఫాదర్' పైనే పెట్టుకున్నారు. మలయాళీ బ్లాక్ బస్టర్ లూసిఫెర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కుతోంది. విజయదశమి కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక రిలీజ్ కి మూడు వారాల సమయం కూడా లేదు. 

ఇంతవరకు చిరంజీవి చిత్రానికి రావాల్సిన హైప్ రాలేదు. చిరంజీవి కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇంతవరకు ప్రమోషన్స్, ఆ సందడి ఎక్కడా కనిపించకపోవడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ఇటీవల ఒక టీజర్ రిలీజ్ చేశారు. అందులో బిజియం లోపాలు స్పష్టంగా కనిపించాయి. కొన్ని రోజుల క్రితం లిరికల్ సాంగ్ లాంచ్ అన్నారు. ఈ సాంగ్ మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ పై చిత్రీకరించారు. ఇద్దరు బడా స్టార్స్ కలసి సాంగ్ చేస్తే హైప్ ఏ రేంజ్ లో ఉండాలి ? ఆ ఉత్సాహం ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సాంగ్ ఇంతవరకు యూట్యూబ్ లో రిలీజ్ కాలేదు. టెక్నికల్ ఇష్యూ అని గాలికొదిలేశారు. 

మరోవైపు కింగ్ నాగార్జున తన ఘోస్ట్ చిత్రం విజయదశమి రోజున రిలీజ్ అవుతోంది అని బిగ్ బాస్ వేదికగా ఖరారు చేశారు. దీనితో మెగా అభిమానులు కోపం తారాస్థాయికి చేరుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్ ని ట్రోల్ చేస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. అనుకున్న టైంకి ఈ చిత్రం వస్తుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. కొణిదెల ప్రొడక్షన్స్ ఈ మౌనానికి కారణం ఏంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. 

మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార కీలక పాత్రలో నటిస్తోంది. సునీల్, సత్యదేవ్, సముద్ర ఖని లాంటి నటులు ఈ చిత్రంలో ఉన్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios