Asianet News TeluguAsianet News Telugu

2022 కొత్త వ్యక్తిని పరిచయం చేసిందంటూ.. మెగా డాటర్ శ్రీజ ఇంట్రెస్టింగ్ పోస్ట్, ఎవరా కొత్త వ్యక్తి..?

మెగా డాటర్ శ్రీజ కొణిదెల సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. 2022 తనకు కొత్త వ్యాక్తిని పరిచయం చేసిందన్నారు. థ్యాంక్స్ కూడా చెప్పారు. ఇంతకీ ఎవారా కొత్త వ్యక్తి.. ? శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతున్నారా..? 
 

Mega Daughter Sreeja Konidela Interesting post Viral in Social Media
Author
First Published Jan 3, 2023, 2:06 PM IST

మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు.. శ్రీజ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. డియర్‌ 2022.. నా జీవితంలో కొత్త వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. నా గురించి బాగా తెలిసిన వ్యక్తి, నన్ను అమితంగా ప్రేమించే వ్యక్తి, కేరింగ్‌గా చూసుకుంటూ.. కష్ట, సుఖాల్లో తోడుండే వ్యక్తి, ఎప్పుడూ నాకు సపోర్ట్‌గా నిలిచే ఆ వ్యక్తి మరెవరో కాదు.. నేనే. ఈ ఏడాది నా గురించి నేను ఎక్కువగా తెలుసుకోవడం ఆనందంగా ఉంది. కొత్త ప్రయాణం మొదలైంది అంటూ  తన పోస్ట్ లో తెలిపింది శ్రీజ. ఈపోస్ట్ సోషల్ మీడియాలో వైరల్అవుతుంది. 

ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుంది శ్రీజ. మూడో వ్యక్తి తన జీవితంలో వస్తున్నాడేమో అని అంతా అనుకుంటున్నారు. కాని శ్రీజ తనను తాను కొత్తగా  తెలుసుకున్నానంటూ ఈ పోస్ట్ ద్వారా తెలిపే ప్రయత్నం చేసింది. చాలా కాలంగా తనను తాను పట్టించుకోలేదని. కాని 2022లో పరిణామాల వల్ల తనను తాను తెలుసుకునే అవకాశం వచ్చిందన్నారు. అందుకే ఇక నుంచి తన గురించి తాను బ్రతుకుతానంటూ తన పోస్ట్ ద్వారా వెల్లడించింది శ్రీజ  2023 నుంచి కొత్త జీవితం స్టార్ట్ చేయబోతున్నట్టు వెల్లడించింది మెగా డాటర్. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sreeja (@sreejakonidela)

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ముద్దుల కూతురిగా  శ్రీజఅందరికి తెలుసు. ఒకప్పుడు తాను ప్రేమించిన వ్యాక్తిని పెళ్లాడి చాలా కాలం కుటుంబానికి దూరం అయ్యింది శ్రీజ. గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ.. కొన్నాళ్లకే మొదటి భర్తతో విడిపోయింది. తర్వాత మెగా ఫ్యామిలీలోకి వచ్చేసింది. ఇక వెంటనే కల్యాణ్‌దేవ్‌ను రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్తతో ఒక పాప.. కల్యాణ్ దేవ్ తో మరొక పాప కలిగారు. ఇక  ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారని.. శ్రీజ త్వరలో మూడో పెళ్లి చేసుకోబోతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

ఈ విషయాన్ని ఈ ఇద్దరు కన్ ఫార్మ్ చేయలేదు కాని దూరంగా ఉంటునన విషయం మాత్రం అర్ధం అవుతుంది. శ్రీజ పుట్టింట్లో ఉంటుంది. మెగాస్టార్ ఇంట్లో జరిగే ఏ ఈవెంట్ లో కళ్యాణ్ దేవ్ కనిపించడంలేదు. ఈ ఇద్దరు తాము కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లైదు. పైగా శ్రీజ తన భర్తతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్ నుంచి తొలగించింది. దాంతో అఫీషియల్ గా చెప్పకపోయినా.. వీరిద్దరు దూరంగా ఉంటున్నట్టు తెలిసిపోయింది. చాలా కాలం గా శ్రీజ ముంబయ్ లో వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. 

ఈ నేపథ్యంలో తాజాగా కొత్త ఏడాది సందర్భంగా శ్రీజ మరో కొత్త విషయాన్ని బయటపెట్టింది. 2023 ఏడాదిలో కొత్త వ్యక్తితో కొత్త ప్రయాణం మొదలైందని వెల్లడించింది.తన వ్యక్తిగత జీవితంలో నెలకొన్ని పరిస్థితుల దృష్ట్యా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది శ్రీజ. 2016 లో కల్యాణ్ దేవ్ ను పెళ్లాడింది. వ్యాపార వేత్తగా ఉన్న కళ్యాణ్ దేవ్..మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో హీరోగా మారాడు. శ్రీజతో మనస్పర్థల తరువాత రెండు సినిమాలు మెగా సపోర్ట్ లేకపోవడంతో ఆగిపోయాయి. ఒక్క సినిమా మాత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios