Asianet News TeluguAsianet News Telugu

'మాస్ మొగుడు'గా వీరసింహారెడ్డి... న్యూ ఇయర్ వేళ ఆసక్తికర అప్డేట్!


వీరసింహారెడ్డి నుండి మరో లిరికల్ సిద్ధం అవుతుంది. నాలుగో సాంగ్ విడుదల తేదీని చిత్ర ప్రకటించారు. గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో జోరు చూపిస్తున్నారు. 
 

mass mogudu forth single coming from balakrishna veerasimhareddy movie
Author
First Published Jan 1, 2023, 5:08 PM IST

సంక్రాంతి హీరోలు తమ చిత్రాల విజయాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. పండగ వేళ భారీ ఓపెనింగ్స్ రాబట్టాలని ప్రణాళికలు వేస్తున్నారు. చాలా కాలం తర్వాత సంక్రాంతికి బడా చిత్రాలు విడుదలవుతున్నాయి. 2020 సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో చిత్రాలు నిలిచాయి. ఆ ఏడాది అతిపెద్ద పోటీ నెలకొంది. ఇక గత రెండు సంక్రాంతులు కరోనా సంక్షోభం కారణంగా సందడి కోల్పోయాయి. ఈ సంక్రాంతికి ఉన్న మరో విశేషం... చిరంజీవి-బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. 

2017 తర్వాత బాలకృష్ణ-చిరంజీవి చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదలవుతున్నాయి. వాల్తేరు వీరయ్య-వీరసింహారెడ్డి చిత్రాలపై భారీ హైప్ నెలకొని ఉంది. విన్నర్ ఎవరు అవుతారనే ఆసక్తి నెలకొంది. వాల్తేరు వీరయ్య ఒకరకంగా మల్టీస్టారర్ అని చెప్పొచ్చు. రవితేజ కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి సోలోగా బాలయ్య వారితో తలపడాల్సి ఉంది. 

కాగా వీరసింహారెడ్డి చిత్రం నుండి ఇప్పటి వరకూ మూడు పాటలు విడుదలయ్యాయి. థమన్ సంగీతం అందిస్తుండగా మూడు పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. నాలుగో సాంగ్ జనవరి 3వ తేదీ సాయంత్రం 7:55 నిమిషాలకు విడుదల చేస్తున్నారు. 'మాస్ మొగుడు' అనే ఈ సాంగ్ లిరికల్ లోని బాలకృష్ణ,శృతి హాసన్ లుక్స్ విడుదల చేశారు. 

క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. వాల్తేరు వీరయ్య కంటే వీరసింహారెడ్డి బుకింగ్స్ బాగున్నాయి. వీరసింహారెడ్డి మూవీలో ధునియా విజయ్ విలన్ రోల్ చేస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios