హిట్ ఇచ్చే కిక్కే వేరు. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ తో పూరి జగన్నాథ్ మామూలుగా లేడు. మళ్లీ మరో బ్లాక్ బస్టర్ కు రంగం సిద్దం చేస్తున్నాడు.  ఆయన ఈ సారి విజయ్ దేవరకొండ ను డైరక్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రం కథ ఇప్పటికే రెడీ అయ్యిందని సమాచారం. అయితే కథ లో పాత్రకు తగినట్లుగా విజయ్ దేవరకొండను రెడీ చేసే పనిలో పడ్డాలు మేకర్స్.  సహజత్వానికి దగ్గరగా ఉండేలా, అర్జున్ రెడ్డి ని మించి పోయేలా సినిమా ఉండాలని కష్టపడుతున్నారు. ఈ నేపధ్యంలో వీరి కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ చిత్రానికి ‘ఫైట‌ర్‌’ అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ను ఖ‌రారు చేశారు.  మార్షల్ ఆర్ట్స్ నేపధ్యంలో చిత్రం రూపొందనుంది. ఇందుకోసం నిర్మాతలు విజయ్ దేవరకొండకు ట్రైనింగ్ ఇవ్వటం కోసం ఓ కోచ్ ని  ఏర్పాటు చేసారు.త్వరలోనే ట్రైనింగ్ మొదలు కానుంది. రెండు నెలలు పాటు ట్రైనింగ్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  ఈ లోగా పూరి జగన్నాథ్ స్క్రిప్టుని లాక్ చేసి, నటీనటులు, టెక్నీషియన్స్ ని ఫైనలైజ్ చేస్తారు.

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌న్నింటినీ పూర్తి చేసుకుని జ‌న‌వ‌రి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. హీరోల‌ను మాస్ యాంగిల్‌లో తెర‌పై ప్రెజెంట్ చేసే పూరి జ‌గ‌న్నాథ్.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌‌ని ఓ రేంజిలో  చూపించబోతారని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.