తొలి నుంచి మా టీవితో నాగార్జునకు మంచి అనుబంధమే ఉంది. ఈ నేపధ్యంలో అక్కినేని కుటుంబ సభ్యులు నటించే చిత్రాల శాటిలైట్ రైట్స్ ని మంచి రేటుకు మా టీవి కొనుగోలు చేస్తూంటుంది. ఈ విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. తాజాగా  మన్మధుడు 2 శాటిలైట్ హక్కుల్ని స్టార్ మా 8.3 కోట్లకు చేజిక్కించుకుందని తెలుస్తోంది. నాగార్జున సినిమాకు ఈ రేటు పలకటం చాలా పెద్ద విషయం. ఇప్పటికే కింగ్ స్టార్ మాలో `బిగ్ బాస్ 3` రియాలిటీ షోకి హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే అదే చానెల్ కి మన్మధుడు 2 రైట్స్ ని విక్రయించడం ట్రేడ్ లో ఇంట్రస్టింగ్ గా మారింది. 
 
నాగార్జున, దర్శకుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం మ‌న్మ‌థుడు 2. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, స‌మంత అతిధి పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ నేపధ్యంలో బిజినెస్ ఊపందుకుంది. 

రీసెంట్ గా  డిజిటల్ రైట్స్ ని ఆన్ లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ 7.4కోట్లకు దక్కించుకుంది. అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ 6.1 కోట్లు పలికాయి. ఇక ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రావు రమేశ్‌, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, దేవదర్శిణి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాగార్జున స్వయంగా జెమిని కిర‌ణ్‌‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆర్‌ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా ప‌ని చేస్తున్నారు.