`ఆర్‌ఎక్స్ 100` తర్వాత అజయ్‌ భూపతి, పాయల్‌ రాజ్‌ పుత్‌ కాంబినేషన్‌లో వచ్చిన `మంగళవారం ` చిత్రం మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతుంది. 

పాయల్‌ రాజ్‌పుత్‌ మెయిన్‌ లీడ్‌గా చేసిన మూవీ `మంగళవారం`. అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన చిత్రమిది. `ఆర్‌ఎక్స్ 100` తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. గత నెలలో విడుదలై మంచి ఆదరణ పొందింది. పాయల్‌ రాజ్‌పుత్‌, నందితా శ్వేత, ప్రియదర్శి, అజయ్‌ ఘోష్‌ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా కమర్షియల్‌ గా యావరేజ్‌ ఫలితాన్ని చవి చూసింది. పాజిటివ్‌ టాక్ వచ్చినా వరల్డ్ కప్‌ క్రికెట్‌ కారణంగా కిల్‌ అయిపోయింది. కమర్షియల్‌గా పెద్ద సక్సెస్‌ సాధించలేకపోయింది. 

ఇక ఇప్పుడు డిజిటల్‌ ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది. ఈ సినిమా ఓటీటీలో రాబోతుంది. ఈ నెల 26న క్రిస్మస్‌ స్పెషల్‌గా `మంగళవారం` చిత్రం విడుదల కాబోతుంది. తాజాగా యూనిట్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో `మంగళవారం` సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. విడుదలైన నెల రోజుల తర్వాత ఈ మూవీ ఓటీటీలో రాబోతుండటం విశేషం. 

ఇక `మంగళవారం` కథ చూస్తే.. ఒక ఊర్లో వరుస మరణాలు చోటు చేసుకుంటాయి. గోడలపై అక్రమ సంబంధాల గురించి గుర్తు తెలియని వ్యక్తులు రాస్తుంటారు. తెల్లారేసరికి వాళ్లిద్దరు ఆత్మహత్య చేసుకుని మరణిస్తుంటారు. ఇలా మంగళవారం రోజు వచ్చిందంటే చాలు ఆ ఊర్లో భయంస్టార్ట్ అవుతుంది. నెక్ట్స్ ఎవరనే టెన్షన్‌ అందరిలోనూ ఉంటుంది. దాన్ని కనిపెట్టేందుకు ఊరంతా పూనుకుంటుంది. ఈ క్రమంలో ఓ షాకింగ్‌ విషయం బయటకు వస్తుంది. పాయల్‌ రాజ్‌పుత్‌ గతం బయటకు వస్తుంది. ఆమె లైంగిక కోరికలు అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని జనాలు ఎలా తప్పుగా అర్థం చేసుకున్నారు, దీని కారణంగా ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది, ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ. 

అక్రమ సంబంధాలపై ఈ సినిమాని సందేశాత్మికంగా రూపొందించారు దర్శకుడు అజయ్‌ భూపతి. `ఆర్‌ఎక్స్ 100` తర్వాత ఆయనకు సక్సెస్‌ లేదు. పాయల్‌కి సక్సెస్‌ లేదు. ఈ నేపథ్యంలో హిట్‌ కోసం ఇద్దరు కలిశారు. హిట్‌ కొట్టారు. మరి ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి. ఇక ఇందులో అజనీష్‌ బీజీఎం హైలైట్‌గా నిలిచింది.