టాలీవుడ్ లో విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు మంచు మనోజ్ ప్రస్తుతం ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో తన మకాంని తిరుపతికి మార్చాడు.
టాలీవుడ్ లో విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు మంచు మనోజ్ ప్రస్తుతం ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో తన మకాంని తిరుపతికి మార్చాడు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తూ వారితో టచ్ లో ఉంటుంటాడు. తాజాగా ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ చూసి మురిసిపోయాడు మంచు మనోజ్.
'రాజకీయాల్లోకి వచ్చేది ఎందుకు ప్రజలకు మంచి చేయడానికి, మనోజ్ అన్న ఇప్పుడే చేస్తున్నాడు. ఎవరైనా హెల్ప్ అంటే చాలు.. వెంటనే స్పందించి సహాయపడడం నేను ఆయనలో చాలా సార్లు గమనించా' అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ ట్వీట్ చూసిన మనోజ్.. 'ఇది చాలురా సామీ.. తృప్తిగా పడుకుంటా.. థాంక్స్ తమ్ముడు' అని బదులిచ్చాడు. ఇక తెలంగాణా ఎలెక్షన్స్ లో గెలుపు టీఆర్ఎస్ దే అంటూ మంచు మనోజ్ కేటీఆర్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.
Scroll to load tweet…
Scroll to load tweet…