లేడీ బాక్సర్ గా మారిన మంచు లక్ష్మీ సీరియస్ గా పంచ్ విసురుతున్నారు. ఆమె నయా అవతార్ చూసిన ఫ్యాన్స్ షాకు అవుతున్నారు. వాట్ ఏ డెడికేషన్ అంటూ ప్రశసంలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం సదరు వీడియో వైరల్ గా మారింది.
మోహన్ బాబు (Mohan Babu) వన్ అండ్ ఓన్లీ డాటర్ మంచు లక్ష్మీ అంటే పరిచయం అక్కర్లేని పేరు. నటిగా వ్యాఖ్యతగా ఆమెకు పలు రంగాల్లో ప్రావీణ్యం ఉంది. మంచు లక్ష్మీ అమెరికన్ యాక్సెంట్ తో కూడిన తెలుగు భలే నవ్వు తెప్పిస్తుంది. ఈ క్రమంలో ఆమె మాటలు మీమ్ రాయుళ్లకు భారీ పెట్టుబడి. మంచు లక్ష్మీ పై వచ్చినన్ని ట్రోల్స్ బహుశా మరో సెలబ్రిటీ మీద వచ్చి ఉండవు. వందల కొద్ది వీడియోలు యూట్యూబ్ లో ఆమెను ట్రోల్ చేస్తూ పుట్టుకొచ్చాయి. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మంచు లక్ష్మీ చలించరు. పని లేని వాళ్ళు చేసే కామెంట్స్, విమర్శలను నేను పట్టించుకోనంటూ ఓపెన్ గా చెప్పిన సందర్భాలు అనేకం.
ఉన్నామా, తిన్నామా అనే లక్షణం ఆమెది కాదు. ఏదో సాధించాలని తపనపడుతూ ఉంటారు. మంచు లక్ష్మీ (Manchu Lakshmi)ఫిట్నెస్ ఫ్రీక్ కూడాను. ఆమె కఠిన యోగాసనాలు, ప్రాణాయామం చేస్తారు. గంటల కొద్దీ జిమ్ లో కసరత్తులు చేస్తారు. నటిగా రాణించాలంటే చక్కని శరీరాకృతి అవసరం. దాని కోసం మంచు లక్ష్మీ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటారు.
తాజాగా మంచు లక్ష్మి జిమ్ ఫిట్ లో బాక్సింగ్ చేస్తూ చెమటలు కక్కిస్తున్నారు. ట్రైనర్ పర్యవేక్షణలో మంచు లక్ష్మీ సీరియస్ గా వరుస పంచ్ లు విసురుతున్న వీడియో వైరల్ గా మారింది. ఫిట్నెస్ పట్ల ఆమె డెడికేషన్ చూసిన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 44 ఏళ్ల మంచు లక్ష్మీ యంగ్ లుక్ వెనుక రహస్యం కూడా ఇదే.
హాలీవుడ్ లో కొన్ని టీవీ షోలు చేసిన మంచు లక్ష్మీ మూడు చిత్రాలు కూడా చేశారు. ఆమె టాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ కావాలని కలలు కన్నారు. గుండెల్లో గోదావరి మూవీలో హీరోయిన్ గా కూడా నటించారు. అయితే మంచు లక్ష్మీ కి అసలు బ్రేక్ రాలేదు. కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆమెకు సక్సెస్ దక్కలేదు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన దొంగాట, లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్ వంటి చిత్రాలు కనీస ఆదరణ దక్కించుకోలేకపోయాయి.
అయితే మంచు లక్ష్మీ పట్టువదలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన యంతాలజీ పిట్టకథలు లో ఆమె నటించారు. పొలిటికల్ లీడర్ గా మంచు లక్ష్మీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి, నాగ్ అశ్విన్, నందిని రెడ్డి వంటి దర్శకులు తెరకెక్కించిన పిట్టకథలు అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.
