మహిళా జర్నలిస్ట్ తో నటుడు సురేష్ గోపీ అసభ్య ప్రవర్తన, సారి చెప్పిన మలయాళ స్టార్..

ప్రముఖ మలయాళ నటుడు సురేష్ గోపీ వివాదాస్పదం అయ్యాడు. ఓ మహిళా జర్నలిస్ట్ తో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలకు ఆయన క్షమాపణలు చెప్పాడు. ఇంతకీ ఏం జరిగిదంటే..? 

Malayalam Actor Suresh Gopi Apologises To Journalist For Misbehaving JmS

ప్రముఖ మలయాళ నటుడు సురేశ్‌ గోపి చిక్కుల్లో పడ్డారు. ఓ మహిళా జర్నలిస్ట్ తో మిస్ బిహేవ్ చేశాడన్న ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కారు. మీడియా ఇంటరాక్షన్‌లో ఓ మహిళా జర్నలిస్టుతో ఆయన  అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. మహిళా జర్నలిస్టు ఫిర్యాదు మేరకు నటుడు, ఎంపీ అయిన  సురేశ్‌ గోపీపై నడకావు పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు చేశారు. 

అంతే కాదు సదరు లేడీజర్నలిస్ట్  కోజికోడ్‌ జిల్లా  ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో విచారణ కోసం కేసును నడకావు పోలీసులకు అప్పగించారు.దాంతో ఆస్టేషన్ లో ఆయనపై కేసు నమోదు అయ్యింది. అయితే అసలు ఏం జరిగిదంంటే. రీసెంట్ గా సురేశ్‌ గోపీ నార్త్‌ కోజిక్కోడ్‌లో ఓకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమం అయిపోగానే.. మాట్లాడవలసిందిగా మీడియా మిత్రులను అతన్నిచుట్టుముట్టారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాని ఆ సమయంలోనే ఓ మహిళా విలేకరి ప్రశ్నకు  సమాధానం ఇస్తూనే ఆమె భుజాలపై చేయి వేశారు. దాంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. 

సురేశ్‌ గోపీ ప్రవర్తనతో ఖంగుతిన్న సదరు మహిళా జర్నలిస్ట్‌ కాస్త దూరం జరిగింది. ఆ తర్వాత మరో ప్రశ్న అడిగేందుకు ముందుకు వచ్చిన ఆమెను అదే విధంగా మరోసారి తాకారు.. దాంతో ఆమెకు కోపం వచ్చింది. తనతో ఇలా అసభ్యంగా ప్రవర్తించిన సురేష్ గోపీపై పిర్యాదు చేసింది. 

నటుడి ప్రవర్తనతో తాను మానసికంగా కలత చెందానని జర్నలిస్ట్‌ పేర్కొన్నారు. జర్నలిస్ట్‌ ఫిర్యాదు మేరకు నటుడిపై సెక్షన్‌ 354ఏ కింద అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేరళ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ (KUWJ) కోరింది. అలాగే సమయంలో కేరళ రాష్ట్ర మహిళా కమిషన్‌ సైతం స్పందించి జిల్లా పోలీస్‌ చీఫ్‌ నుంచి నివేదికను కోరింది.\

 

 ఈ ఘటన అంటు ఫిల్మ్ ఇండస్ట్రీలోను.. ఇటు రాజకీయంగాను  సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సురేశ్‌ గోపీ ప్రవర్తనపై నెటిజన్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. మహిళా జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌ ద్వారా పోస్ట్‌ పెట్టిన ఆయన.. క్షమాపణలు కోరారు. తాను ఆమెను కుమార్తెగా భావించానని.. ఆప్యాయంగానే భుజంపై చేసి వేశానన్నారు. జర్నలిస్ట్‌ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నానని.. తన ప్రవర్తతో ఇబ్బంది పడినట్లయితే చెబుతున్నట్లు పోస్ట్‌ పెట్టారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios