కరోనా వల్ల పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకూ అన్నీ ఇబ్బందులు పడవలసి వస్తుంది. రిలీజ్ డేట్ల విషయంలో చిక్కులు తప్పడం లేదు. పెద్ద సినిమాల పోటీ మధ్య.. అడవి శేష్(Adivi Sesh)  మేజర్(Major) మూవికి ముచ్చటగా మూడో రిలీజ్ డేట్ ఇచ్చారు టీమ్.

 కరోనా వల్ల పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకూ అన్నీ ఇబ్బందులు పడవలసి వస్తుంది. రిలీజ్ డేట్ల విషయంలో చిక్కులు తప్పడం లేదు. పెద్ద సినిమాల పోటీ మధ్య.. అడవి శేష్(Adivi Sesh) మేజర్(Major) మూవికి ముచ్చటగా మూడో రిలీజ్ డేట్ ఇచ్చారు టీమ్.

చిన్నా పెద్దా సినిమాలకు రిలీజ్ కష్టాలు తప్పడం లేదు. పుష్ప,అఖండలాంటి సినిమాలు మంచి టైమ్ చూసుకుని రిలీజ్ అయ్యి రికార్డ్స్ క్రియేట్ చేశాయి. కాని అంతకంటే ముందు నుంచి తెరకెక్కుతున్న మేజర్(Major) లాంటి సినిమాలకు ఇంకా రిలీజ్ మోక్షం లభించలేదు. ఇప్పటికే రెండు రిలీజ్ డేట్లు మార్చుకున్న టీమ్ ఇప్పుడు ముచ్చటగా మూడో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

అడివి శేష్ (Adivi Sesh) మేజర్(Major)  సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు టీమ్. ఫిబ్రవరి నుంచి సమ్మర్ కు జంప్ అయ్యింది సినిమా. 27 మే 2022 న సినిమాను థియేటర్లలోకి తీసుకువస్తున్నామంటూ.. పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్. అప్పటికి పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ లు అయిపోయి.. థియేటర్లు ఫ్రీ అవుతాయి అని భావిస్తున్నారు మేజర్ టీమ్. ఏ సినిమాకు పోటీ లేకుండా సేఫ్ జోన్ చూసుకున్నారు.

Scroll to load tweet…

మేజర్ (Major) సినిమాకు ఇప్పటికే రెండు రిలీజ్ డేట్లు మారిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా మేజర్ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ఫస్ట్ డేట్ గా 21 జులై 2‌021 డేట్ ఇచ్చారు. ఆతరువాత కరోనా పరిస్థితుల వల్ల అప్పుడు రిలీజ్ చేయలేక పోయారు. షూటింగ్ కూడా డిలై అవ్వడంతో.. అన్ని రకాలుగా ఆలోచించి పిబ్రవరి11న రిలీజ్ అంటూ మరో డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఎవరూ పోటీ రారు..హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు అనుకున్నారు. కాని ఈసారి కూడా కరోనా థార్డ్ వేవ్ దెబ్ కొట్టింది మేజర్ టీమ్ ను.

మేజర్ (Major) మూవీ రిలీజ్ చేయబోతున్నట్టు గతంలోనే వీడియో టీజర్ తో పాటు అనౌన్స్ చేశారు టీమ్. కరోనా వల్ల షూటింగ్ డిలై అవ్వడం..కరోనా ఇబ్బందితో పాటు ఈమధ్య అడవి శేష్ (Adivi Sesh) కు ఆరోగ్యం పాడవడం...హాస్పిటలైజ్ అవ్వడంతో.. సినిమా షూటింగ్ ఇంకా లేట్ అయ్యింది. దాంతో లాస్ట్ ఇయర్ లోనే రిలీజ్ అవ్వాల్సిన సినిమాను ఇంత దూరం లాక్కు రావల్సి వచ్చింది.

అడవిశేష్ (Adivi Sesh) తక్కువ బడ్జెట్ లో అదిరిపోయే సినిమాలు తీసే హీరో. తన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. త్వరలో మేజర్ (Major) సినిమాతో రాబోతున్నాడు శేష్. 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని ‘మేజర్’ సినిమాతో రాబోతున్నాడు శేష్.

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న మేజర్ మూవీని గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా ఈ సినిమాని డైరెక్టర్ చేశాడు. ఈ సినిమా నిర్మాణంలో మహేష్ బాబు (Mahesh Babu) కూడా పాలు పంచుకున్నాడు. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేష్ ఈ సినిమాని సోనీ పిక్చర్స్, ఏప్లస్ఎస్ మూవీస్ తో కలిసి నిర్మిస్తున్నారు. మేజర్ నుంచి ఇప్పటి వరకూ రిలీజ్ అయిన మేకింగ్ వీడియోస్, పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.