Asianet News TeluguAsianet News Telugu

'మజిలీ' రన్ టైం ఎంతో తెలుసా..?

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తోన్న చిత్రం 'మజిలీ'. 'నిన్ను కోరి' ఫేం దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

majili movie run time
Author
Hyderabad, First Published Apr 4, 2019, 2:51 PM IST

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తోన్న చిత్రం 'మజిలీ'. 'నిన్ను కోరి' ఫేం దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లి తరువాత సమంత, చైతు కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

దానికి తగ్గట్లే సినిమా టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని 'యూ/ఏ' సర్టిఫికేట్ పొందింది. 2 గంటల 34 నిమిషాల నిడివితో సినిమా ప్రదర్శితం కానుంది.

ఈ మధ్యకాలంలో చాలా  సినిమాలు రెండు గంటల పది నిమిషాలు, ఇరవై నిమిషాలతో ముగించేస్తున్నారు. నిడివి ఎక్కువ ఉన్నా.. ప్రేక్షకులు విసిగిపోయే ఛాన్స్ ఉందని ఆ నిర్ణయం తీసుకుంటున్నారు.

అయితే ఈ సినిమాలో ఎమోషనల్ పార్ట్ ఎక్కువగా ఉండడంతో కాస్త నిడివి ఎక్కువ ఉన్నా.. ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారనే ధైర్యంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి! 

Follow Us:
Download App:
  • android
  • ios