`సర్కారు వారి పాట` ట్రైలర్ ఈవెంట్ కోసం మహేష్ బాబు అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. ట్రైలర్ సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయగా, మధ్యాహ్నం నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు.
మహేష్ బాబు నుంచి వస్తోన్న కొత్త చిత్రం `సర్కారు వారి పాట`. ఫుల్ మాస్, క్లాస్ మేళవింపుగా దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. `గీత గోవిందం` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన్నుంచి వస్తోన్న చిత్రమిది. కీర్తిసురేష్ కథానాయికగా నటించింది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ నేడు(మే 2)న విడుదలైంది. హైదరాబాద్‌లోని భ్రమరాంబ థియేటర్ లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ని నిర్వహించారు.
ఈ ట్రైలర్ ఈవెంట్ కోసం మహేష్ బాబు అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. ట్రైలర్ సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయగా, మధ్యాహ్నం నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. దీంతో భ్రమరాంబ థియేటర్ ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయింది. అభిమాన హీరో చిత్ర ట్రైలర్‌ని పెద్ద తెరపై చూసి ఎంజాయ్ చేయాలనుకున్నారు. కానీ ఊహించని కంటే ఎక్కువగా, థియేటర్‌లో పట్టలేనంతంగా జనం రావడంతో అక్కడ మొత్తం కిక్కిరిసిపోయింది. అభిమానులతో పోటెత్తిపోయింది.

అయితే ఈక్రమంలో అభిమానులు థియేటర్‌లోకి తోసుకెళ్లారు. దీంతో థియేటర్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఫ్యాన్స్ చేసిన హంగామా మామూలుగా లేదని చెప్పొచ్చు. ఓ వైపు ట్రైలర్ దుమ్ములేపుతుంది. బీజీఎం మోత, మహేష్ మాస్ డైలాగ్‌లతో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. దీంతో ఆగలేక అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చివరికి థియేటర్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో కొంత మంది అభిమానులు గాయపడినట్టు సమాచారం.
ఇక ఇప్పటికే విడుదలై టీజర్, ఈ చిత్రంలోని రెండు పాటలు విశేష ఆదరణ పొందాయి. దాదాపు వంద మిలియన్స్ రీచ్ అయ్యాయి. ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. దాన్ని తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. ఈ నెల 12న థియేటర్లో మాస్ జాతర సాగనుందని చెప్పొచ్చు. మే 12న ఈ సినిమా విడుదల కాబోతుంది. అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని ట్రైలర్ స్పష్టం చేసింది. దీంతో ఇక మహేష్ ఫ్యాన్స్ కి పూనకాలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
