Asianet News TeluguAsianet News Telugu

`పెద కాపు` టైటిల్‌తో మహేష్‌ దర్శకుడి సినిమా?.. స్టోరీ తెలిస్తే రచ్చే!

మహేష్‌బాబుతో వరుసగా రెండు సినిమాలు చేసి మెప్పించిన సెన్సిబుల్‌ డైరెక్టర్ శ్రీకాంత్‌ అడ్డాల కొంత గ్యాప్‌తో ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నారు. దీనికి `పెద కాపు` అనే టైటిల్‌ వినిపిస్తుండటం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.

maheshbabu director next movie with peda kapu title hot topic ?
Author
First Published Apr 24, 2023, 4:37 PM IST

దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల.. తెలుగు కల్చర్‌కి పెద్ద పీఠ వేస్తూ సినిమాలు తీశారు. ముఖ్యంగా కోన సీమ అందాలను, యాస, సంస్కృతి, కట్టుబొట్లని తన సినిమాల్లో ఆవిష్కరించారు. అక్కడ ఫ్యామిలీ అనుబంధాలు, అలకలు, గొడవలు, అందాలను వెండితెరపై ఆవిష్కరించి విజయాలు అందుకున్నారు. `కొత్త బంగారు లోకం`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `ముకుంద`, `బ్రహ్మోత్సవం` చిత్రాలతో తన ప్రత్యేకత ఏంటో చాటుకున్నారు. స్వచ్ఛంగా కుటుంబ అనుబంధాలకే ప్రయారిటీ ఇస్తూ ఆయా ఫ్యామిలీల్లో చోటు చేసుకున్న సంఘటనలను, సంఘర్షణలను కళ్లకి కట్టినట్టు చూపించి సక్సెస్‌ అయ్యారు. 

ఇవన్నీ ఓ ఎత్తైతే అంతర్లీనంగా తన సినిమాల్లో చాలా వరకు కాపు సామాజిక వర్గాన్ని పెద్దపీఠ వేసే ప్రయత్నం చేశారు. తన సినిమాల్లో పాత్రల పేర్లన్ని ఆయా సామాజిక వర్గానికి చెందినవిగానే ఉంటాయి. `ముకుంద`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `బ్రహ్మోత్సవం` చిత్రాల్లోనూ అదే సెంటిమెంట్‌ కనిపించింది. అవి ఆడియెన్స్ ని మెప్పించాయి. `బ్రహ్మోత్సవం`లో ఏకంగా `నాయుడోరింటికాడ` అనే పాటనే పెట్టాడు. కాపు వర్గం గురించి మరింత బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరోసారి అదే సెంటిమెంట్‌తో వస్తున్నారు దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. 

శ్రీకాంత్‌ అడ్డాల ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేశారు. అందులో మూడు విజయం సాధించాయి. కానీ `బ్రహ్మోత్సవం`తో బోల్తా కొట్టారు. ఏడు తరాలు వెనక్కి వెళ్లాలలనే కాన్సెప్ట్ తో చేసిన ఈ చిత్రం పెద్దగా వర్కౌట్‌ కాలేదు. ఆ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకుని రీమేక్‌ సినిమా `నారప్ప` చేశారు. ఇది తమిళంలో వచ్చిన `అసురన్‌`కి రీమేక్‌. పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ సినిమా కూడా ఆడలేదు. దీంతో మళ్లీ తన మార్క్ ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అందులోనూ కాపు సెంటిమెంట్‌ని రిపీట్‌ చేస్తున్నారు. అది మామూలు రిపిటేషన్‌ కాదు, ఏకంగా అది టైటిల్స్ లోకి వస్తుండటం విశేషం. 

 `జయజానకి నాయక`, `అఖండ` వంటి చిత్రాలను రూపొందించిన నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాణంలో ఆయన  మేనల్లుడు హీరోగా పరిచయం చేస్తూ సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి కాపు సెంటిమెంట్‌ వచ్చేలా `పెద కాపు` అనే టైటిల్‌ నిర్ణయించినట్టు సమాచారం. ఈ సినిమా కూడా కోనసీమ నేపథ్యంలోనే సాగుతుందట. 1980 బ్యాక్‌ డ్రాప్‌లో సాగే కథ అని తెలుస్తుంది. ఆ టైమ్‌లో కోనసీమలో రాజకీయాలు, అక్కడ వర్గ పోరాటాలు, కులాల ఆదిపత్యాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని, కాస్త రా కంటెంట్‌తోనే శ్రీకాంత్‌ అడ్డాల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఏపీలో కులాల నేపథ్యంలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు శ్రీకాంత్‌ అడ్డాల ఏకంగా `పెద కాపు` అనే టైటిల్‌తో ఆయా రాజకీయ నేపథ్యంతోనే సినిమా చేస్తుండటంతో దీని రచ్చ మామూలుగా ఉండదని చెప్పొచ్చు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios