Asianet News TeluguAsianet News Telugu

‘మహర్షి’ రీమేక్ రైట్స్.. డైలమోలో పెట్టిన హీరో!

హిట్ అయ్యిన తర్వాత రీమేక్ రైట్స్ తీసుకోవటం ఓల్డ్ ట్రెండ్. ఎందుకంటే అప్పుడు లైన్ లో నుంచొని, పోటి ఎదుర్కొని రైట్స్ సొంతం చేసుకోవాలి

Mahesh's Maharshi tamil remake with Vijay?
Author
Hyderabad, First Published May 3, 2019, 9:29 AM IST

హిట్ అయ్యిన తర్వాత రీమేక్ రైట్స్ తీసుకోవటం ఓల్డ్ ట్రెండ్. ఎందుకంటే అప్పుడు లైన్ లో నుంచొని, పోటి ఎదుర్కొని రైట్స్ సొంతం చేసుకోవాలి. అదే ఓ సినిమా రిలీజ్ కు ముందే హిట్ అవుతుందని అని అంచనా వేయగలిగి రీమేక్ రైట్స్ తీసుకుంటే బిజినెస్ కు బాగా ప్లస్ అవుతుంది. పెద్ద నిర్మాతలు ఇప్పుడు అదే ప్లో ఫాలో అవుతున్నారు. మొన్నా మధ్య కేవలం ట్రైలర్ చూసి 96 రీమేక్ రైట్స్ రిలీజ్ కు ముందే సొంతం చేసుకున్నారు దిల్ రాజు. అదే పద్దతిలో ఇప్పుడు మహేష్ బాబు తాజా చిత్రం ‘మహర్షి’ తమిళ రీమేక్ కోసం రైట్స్ ని సొంతం చేసుకోవాలని నిర్మాతలు ఎగబడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

అంతేకాదు ఈ సినిమాను తమిళంలో విజయ్‌ రీమేక్‌ చేయనున్నారని చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా  మహేష్ చేసిన ‘ఒక్కడు, పోకిరి’ సినిమాల తమిళ రీమేక్స్‌లో విజయ్‌ నటించారు. రెండూ పెద్ద హిట్స్‌గా నిలిచాయి.  దాంతో  ‘మహర్షి’ రీమేక్‌లో నటిస్తే  బాగుంటుందనే ఆలోచనలో విజయ్ ఉన్నారట. అయితే సినిమా రిజల్ట్ చూడకుండా నిర్ణయం తీసుకోలేనని తన నిర్మాతలకు చెప్పేసారట. దాంతో రిస్క్ తీసుకుని రైట్స్ తీసుకోవాలా వద్దా అనే డైలమోలో విజయ్ తో సినిమా చెయ్యాలనుకున్న ప్రొడ్యూసర్స్ ఉన్నారట. 

ఇక మహేష్ తన 25వ సినిమా గా ‘మహర్షి’ సినిమాని చేశారు. మే 9న ఈ సినిమా రిలీజ్‌ కానుంది.  గెలవడమే అలవాటుగా ఉన్న ఓ యువకుడి కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్టు తెలుస్తోంది. ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాను సార్‌, ఇక్కడ ఏవడి బరువు వాడే మోసుకోవాలి, అమ్మాయి కాఫీకి పిలిచిందని లైఫ్‌ రిస్క్‌ చేయలేముగా, గతంలో ఎక్కడున్నాం.. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం.., ఓడిపోతామనే భయంతో దిగితే ఎప్పటికీ గెలవలేం.. అంటూ ట్రైలర్ లో మహేష్ చెప్పిన డైలాగులు హైలెట్ గా నిలిచాయి.

Follow Us:
Download App:
  • android
  • ios