Asianet News TeluguAsianet News Telugu

#Rajamouli: త్రివిక్రమ్ కు రాజమౌళి కామెంట్స్ సమస్యగా మారుతున్నాయా?

ప్రస్తుతానికి మహేష్ బాబు త్రివిక్రమ్ తో తన 28వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ తరువాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా ప్రారంభించనున్నారు.

Mahesh Rajamouli film is clearly dominating SSMB28 even before its launch
Author
First Published Nov 30, 2022, 8:18 AM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా ప్రేక్షకులను బాగా  అలరించాయి. అలాగే ఈ  రెండు సినిమాలలో కూడా మహేష్ ని చాలా డిఫరెంట్ గా స్క్రీన్ మీద త్రివిక్రమ్ ప్రజెంట్ చేశాడు. అతడు సినిమాలో   ప్రొఫెషనల్ కిల్లర్ గా.. డైలాగులు తక్కువ యాక్షన్ ఎక్కువ టైప్ లో కొత్తగా చూపెడుతూ. హీరోయిజాన్ని ఎలివేట్ చేసారు. అలాగే ఆ తర్వాత వచ్చిన  “ఖలేజా” లో  మహేష్ లో ఉన్న ఫన్ యాంగిల్ త్రివిక్రమ్ బయటకు లాగాడు.  ఆ తర్వాత ఆయన ఫన్ సినిమాలు దున్నేసారు. ఇక ఇప్పుడు ఈ సారి మహేష్ ని ఎలా చూపెడతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఈ నేపధ్యంలో SSMB28  సినిమాకు మంచి క్రేజ్, బజ్ ఏర్పడిన మాట వాస్తవం. అయితే రాజమౌళి గత కొద్ది రోజులుగా మహేష్ తో తను చేయబోయే సినిమా గురించి చెప్తూ వస్తున్నారు. లాంచ్ కూడా కాని ఆ సినిమా గురించి ఆయన చేస్తున్న కామెంట్స్ ప్రాజక్టు పై విపరీతమైన క్రేజ్ పెంచుతున్నాయి.  టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న రాజమౌళి అక్కడే తన తదుపరి చిత్రానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. టోరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న రాజమౌళి మహేష్ బాబుతో చేసే సినిమా ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఒక ప్రపంచ యాత్రికుడి కధ అని ఆయన చెప్పుకొచ్చారు.  మహేష్ కోసం రాజమౌళి రెండు కథలు రెడీ చేసారట. అందులో ఒకటి అమెజాన్ అడవులలో ఉన్న నిధి వేట అంటే ఒక ట్రెజర్ హంట్ లాంటి కధ సిద్ధం చేయగా మరొకటి జేమ్స్ బాండ్ తరహా అడ్వెంచర్స్ కథ అని తెలుస్తోంది. 

ఇక ఇప్పుడు ఆ సినిమాకు ప్రిపరేషన్ లా త్రివిక్రమ్ సినిమా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్రివిక్రమ్ సినిమా గురించి ఒక్క మాటా బయిటకు రాలేదు. అది ఎలాంటి సినిమానో తెలియదు. దాంతో ఖచ్చితంగా త్రివిక్రమ్ సినిమా పై ప్రెజర్ పడుతుంది. కనపడని పోటీ అది. రాజమౌళి, మహేష్ సినిమాకు వస్తున్న హైప్ ని త్రివిక్రమ్ సినిమా రీచ్ కావాల్సి ఉంటుంది. ఇదో విచిత్రమైన పరిస్దితి. అయితే త్రివిక్రమ్ బలాలు వేరు. ఆయన రైటింగ్ స్టైల్ వేరు. ఎవరి సినిమాలు వాళ్లవే అన్నట్లు ఉంటాయి. మరో ప్రక్క   త్రివిక్రమ్ తర్వాత రాజమౌళి సినిమా ప్రారంభం కానున్న నేపథ్యంలో… ఒక్కసారి రాజమౌళి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే చాలా టైం పట్టే అవకాశం ఉండటంతో దాని కంటే ముందుగానే సినిమా కంప్లీట్ చేయాలి త్రివిక్రమ్.
 

Follow Us:
Download App:
  • android
  • ios