రాజమౌళి మల్టీస్టారర్ కి మహేష్ బాబు టచ్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 12, Aug 2018, 12:06 PM IST
mahesh babu voice over for rajamouli's multistarrer
Highlights

ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పాటు మహేష్ బాబు కూడా భాగం కానున్నాడని సమాచారం. అయితే మహెష్ గెస్ట్ రోల్ లో కనిపిస్తాడని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే రాజమౌళి మహేష్ తో చిన్న వాయిస్ ఓవర్ చెప్పించాలని నిర్ణయించుకున్నాడట. రాజమౌళి అడిగితే గనుక మహేష్ కాదనడు

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ సినిమాకు రూపొందించనున్న సంగతి తెలిసిందే.ఆ క్టోబర్ నెల నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అదేంటంటే.. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పాటు మహేష్ బాబు కూడా భాగం కానున్నాడని సమాచారం. అయితే మహెష్ గెస్ట్ రోల్ లో కనిపిస్తాడని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే రాజమౌళి మహేష్ తో చిన్న వాయిస్ ఓవర్ చెప్పించాలని నిర్ణయించుకున్నాడట. రాజమౌళి అడిగితే గనుక మహేష్ కాదనడు కాబట్టి దాదాపు మహేష్ వాయిస్ ఓవర్ చెప్పడమనేది ఖాయమనిపిస్తోంది.

పైగా చరణ్, ఎన్టీఆర్, మహేష్ ముగ్గురు మంచి స్నేహితులు కూడా.. మహేష్ వాయిస్ ఓవర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుంది. ప్రస్తుతం చరణ్.. బోయపాటి సినిమాతో అలానే ఎన్టీఆర్.. త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ రెండు ఓ కొలిక్కి వచ్చిన తరువాత ఇద్దరూ రాజమౌళితో సెట్స్ పైకి వెళ్లనున్నారు. 

loader