టాలీవుడ్, ఏపి గవర్నమెంట్ మధ్య ఎప్పటి నుంచో నలుగుతున్న సమస్యలు ఈరోజుతో కొలిక్కి వచ్చాయి. ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ (Megastar) తో పాటు మహేష్ బాబు (Mahesh Babu) మరికొంత మంది హీరోలు, డైరెక్టర్లు సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. ఇక సూపర్ స్టార్ ఈ విషయం గురించి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
టాలీవుడ్, ఏపి గవర్నమెంట్ మధ్య ఎప్పటి నుంచో నలుగుతున్న సమస్యలు ఈరోజుతో కొలిక్కి వచ్చాయి. ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ (Megastar) తో పాటు మహేష్ బాబు (Mahesh Babu) మరికొంత మంది హీరోలు, డైరెక్టర్లు సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. ఇక సూపర్ స్టార్ ఈ విషయం గురించి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇండస్ట్రీలో ఏపీ ప్రభుత్వ అనిచ్చితి వాతావరణానికి ఈరోజుతో తెరపడటంతో అంతా హ్యాపీగా ఉన్నారు. టికెట్ రేట్లు.. ఎక్స్ ట్రా షోలు.. చిన్న సినిమాలు,పెద్ద సినిమాలను దృష్టిలో ఉంచుకుని జరిగిన చర్చలు సక్సెస్ అవ్వడంతో ఫుల్ హుషారుగా ఉన్నారు టాలీవుడ్ పెద్దలు. ఈ నెల చివరి వారం లోపు జీవో కూడా వస్తుందని తెలియడంతో అంతా కూల్ అయ్యారు.
హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లిన సినిమా టీమ్ లో మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi) టీమ్ లీడ్ చేయగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయనమూర్తి, అలీ లాంటి వారు ఉన్నారు. సినిమాకు సంబంధించిన సమస్యలు సీఎం సానుకూలంగా విన్నారని.. అన్నింటికి పరిష్కారం అయ్యేలా చూస్తానని చెప్పారని.. ప్రెస్ మీట్ లో చెప్పారు స్టార్.. ఈ సందర్భంగా మహేష్,ప్రభాస్, రాజమౌళి కూడా మాట్లాడి సీఎం కు థ్యాక్స్ చెప్పారు.
ఇక అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు టీమ్. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఈ చర్చల గురించి ట్వీట్ చేశారు. సీఎం జగన్ కు పదే పదే ధన్యవాదాలు తెలిపిన మహేష్.. ఇండస్ట్రీ సమస్యలపై జగన్ (Jagan) కు ఉన్న అవగాహనకు..ఈ విషయంలో ఆయన తీసుకున్న చొరవకు థ్యాక్స్ చెప్పారు. త్వరలో మంచి రోజులు వస్తాయని.. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సినిమాల పనులు పూర్తి కాబోతున్నట్టు మహేష్ (Mahesh) సంతోషం వ్యక్తం చేశారు.
ఇక పనిలో పనిగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి కూడా మహేష్ థ్యాక్స్ చెప్పారు. ఇండస్ట్రీలో ఏర్పడిన అనిశ్చితిన తొలగించే పనిలో ముందడుగు వేసి.. జగన్ తో మాట్లాడి సమస్యలకు ఓ పరిష్కారం చూపడంతో మెగాస్టార్ చొరవకు మహేష్ (Mahesh) ధన్యవాదాలు తెలిపారు. అటు ఈ విషయంలో అన్ని విధాలుగా సహకరించిన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి కూడా మహేష్ థ్యాంక్స్ చెప్పారు.
