Asianet News TeluguAsianet News Telugu

మహేష్ - రాజమౌళి కాంబో.. క్లారిటీ వచ్చేసింది!

ప్రముఖ దర్శకుడు రాజమౌళితో సినిమా చేసే అవకాసం ఉందంటూ బాహుబలికి ముందు నుంచీ వార్తలు వస్తున్నాయి. బాహుబలి రిలీజ్ తర్వాత అవి ఊపందుకున్నాయి. జేమ్స్ బాండ్ తరహా చిత్రం మహేష్ తో రాజమౌళి చేస్తున్నారని అన్నారు. 

Mahesh Babu talked about his film with SS Rajamouli
Author
Hyderabad, First Published May 5, 2019, 4:03 PM IST

ప్రముఖ దర్శకుడు రాజమౌళితో సినిమా చేసే అవకాసం ఉందంటూ బాహుబలికి ముందు నుంచీ వార్తలు వస్తున్నాయి. బాహుబలి రిలీజ్ తర్వాత అవి ఊపందుకున్నాయి. జేమ్స్ బాండ్ తరహా చిత్రం మహేష్ తో రాజమౌళి చేస్తున్నారని అన్నారు. అయితే ఊహించని విధంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ పట్టాలు ఎక్కింది. మరి మహేష్ తో ఎప్పుడు రాజమౌళి సినిమా చెయ్యబోతున్నారు. అసలు చేస్తారా..విన్నవన్ని కేవలం రూమర్స్ మాత్రమేనా..ఈ ప్రశ్నలన్ని సామాన్య  సిని ప్రేమికుడు మనస్సులో ఎప్పుడూ మెదులుతూనే ఉన్నాయి. వాటికి మహేష్ సమాధానం ఇచ్చి క్లారిటీ ఇచ్చారు. 

మహేష్ బాబు 25వ సినిమా మహర్షి గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయిపోయింది.  ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకి ఇంటర్వూలిస్తున్నారు మహేష్. అందులో భాగంగా రాజమౌళితో సినిమా ప్రస్తావన మీడియా వారు తీసుకువచ్చారు. అప్పుడు మహేష్ పాజిటివ్ గా స్పందించారు.  రాజమౌళితో తప్పకుండా సినిమా ఉంటుందన్నారు. 

ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి అని మహేష్ చెప్పాడు. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలు త్వరలో తెలుస్తాయి చెప్పుకొచ్చాడు. స్వయంగా మహేష్, రాజమౌళితో సినిమా ఉంటుందని ఖరారు చేసి చెప్పటంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్  పండుగ చేసుకుంటున్నారు. అంటే మనం మహేష్ ని జేమ్స్ బాండ్ తరహా సినిమా తరహాలో చూసే రోజు అతి దగ్గరలోనే ఉందన్నమాట. 

Follow Us:
Download App:
  • android
  • ios