Asianet News TeluguAsianet News Telugu

SVP: 'భీమ్లానాయక్' ని క్రాస్ చేస్తోందా.. అదే జరిగితే.. ?

మహేష్ కు సంబంధించి 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైన నాలుగో సినిమా కావటం విశేషం. అలాగే ఇప్పుడీ చిత్రం యుఎస్ లో  2.1 మిలియన్స్ వసూలు చేసింది.  

Mahesh Babu Sarkaru Vaari Paata cross Bheemla Nayak?
Author
Hyderabad, First Published May 18, 2022, 4:44 PM IST


పెద్ద సినిమాల కలెక్షన్స్ ని ఒక సినిమాతో మరొకటి పోల్చి చూడటం కామన్ గా జరిగే విషయం. అలాగే ఇప్పుుడు మహేష్ బాబు తాజా చిత్రం సర్కారు వారి పాటని మిగతా సినిమాల కలెక్షన్స్ తో పోల్చి చూస్తున్నారు. ఈ సినిమాకు రిలీజ్ రోజు డివైడ్ టాక్ వచ్చినా సెకండ్ డే నుంచి పుంజుకుంది. భారీగా కలెక్షన్స్ కుమ్మరించకపోయినా డ్రాప్ మాత్రం తక్కువగా ఉండటం గమనార్హం. ముఖ్యంగా ఓవర్ సీస్ లో భీమ్లానాయక్ రికార్డ్ ని బ్రద్దలు కొట్టే అవకాసం ఉందంటున్నారు. అదెంతవరకూనో చూద్దాం.

 మొదటి నుంచి మహేష్ కు ఓవర్ సీస్ లో మంచి మార్కెట్ ఉంది. ఇక్కడ యావరేజ్ అనకున్న సినిమాలు సైతం అక్కడ దుమ్ము దులుపుతూంటాయి. ఈ సారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అయ్యింది. ఓవర్సీస్ లో మహేష్ బాబు కొత్త రికార్డ్ సృష్టించాడు.  మహేష్ నటించిన సర్కారువారి పాట సినిమా యూఎస్ లో 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. మహేష్ కు సంబంధించి 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైన నాలుగో సినిమా కావటం విశేషం. అలాగే ఇప్పుడీ చిత్రం యుఎస్ లో  2.1 మిలియన్స్ వసూలు చేసింది. సెకండ్ వీకెండ్ లో మళ్లీ పికప్ అయ్యే అవకాసం బాగా కనపడుతోంది. యుఎస్ మార్కెట్ లో మహేష్ కు మంచి గ్రిప్ ఉంది. ఆయన సినిమాలకు తిరుగు ఉండదు. వరస బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.

ఆర్.ఆర్.ఆర్,కేజీఎఫ్ చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ అక్కడ హైయిస్ట్ గ్రాసర్ గా నిలిచింది.  $2.45 మిలియన్స్ అక్కడ వసూలు చేసింది. ఇప్పుడు సర్కారు వారి పాట చిత్రం కూడా ఆ రికార్డ్ ని బ్రద్దలు కొట్టే అవకాసం ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం. మహేష్ బాబు వరసగా శ్రీమంతుడు, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట సినిమాలతో అమెరికా మార్కెట్ లో 2 మిలియన్స్ డాలర్స్ కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసాడు మహేష్. 
 
ఇలా వరసగా నాలుగేసి సినిమాలతో 2 మిలియన్ డాలర్ క్లబ్ లో కొనసాగుతున్న సౌత్ హీరోలు మరో ఇద్దరు మాత్రమే ఉన్నారు. రజనీకాంత్, ప్రభాస్ కు చెందిన సినిమాలు చెరో నాలుగు, 2 మిలియన్ డాలర్ క్లబ్ లో ఉన్నాయి. అయితే అవన్నీ పాన్ ఇండియా సినిమాలు. కేవలం తెలుగులో రిలీజై 2 మిలియన్ డాలర్ క్లబ్ వరకు వెళ్లడం ఒక్క మహేష్ కు మాత్రమే ఇప్పటివరకు సాధ్యమైంది.

అలాగే మిగతా హీరోల విషయానికొస్తే.. ఎన్టీఆర్ నటించిన 3 సినిమాలు, 2 మిలియన్ డాలర్ క్లబ్ లో ఉన్నాయి. చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ హీరోల నుంచి చెరో రెండే సినిమాలు ఈ క్లబ్ లో ఉన్నాయి. మహేష్ సినిమాలకి అమెరికాలో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే అమెరికాలో 1 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాలు మహేష్ కి 8 ఉన్నాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డు. అత్యధిక 1 మిలియన్ సినిమాలు కలిగిన హీరోగా మహేష్ పేరిట ఈ రికార్డు ఉంది. తాజాగా సర్కారు వారి పాట సినిమాతో మరో రికార్డు మహేష్ ఖాతాలోకి చేరింది.

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కింది సర్కారువారి పాట. ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా, కాస్త సందేశాత్మకంగా వచ్చిన ఈ సినిమా మహేష్ కెరీర్ లో మరో హిట్ సినిమాగా నిలిచింది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios